నువ్వులు చలికాలంలో ఎందుకు తినాలో తెలుసా?

03 December 2024

TV9 Telugu

TV9 Telugu

నువ్వులు అద్దిన అరిసెలు తింటే ఆ రుచే వేరు. జంతికల్లో కాసిన్ని చేర్చితే అబ్బో టేస్ట్ అదుర్స్‌ అంతే. నువ్వుండల గురించి ఇక చెప్పేదేముంది? నువ్వులు రుచికి మాత్రమే కాదు ఇందులో అపారమైన పోషకాలు కూడా ఉన్నాయి

TV9 Telugu

రోజూ కాసిని నువ్వులని ఆహారంలో చేర్చుకునే వారికి కొలెస్ట్రాల్‌తోపాటు, ట్రైగ్లిజరాయిడ్లు అదుపులో ఉంటాయట. ఫలితంగా గుండెజబ్బుల నుంచి రక్షణ దొరుకుతుంది

TV9 Telugu

నువ్వుల్లో మేలు చేసే కొవ్వులు ఉండటమే ఇందుకు కారణం అంటున్నాయి అధ్యయనాలు. మామూలు నువ్వులతో పోలిస్తే వేయించినవి తింటే మాంసకృత్తులు పుష్కలంగా అందుతాయట

TV9 Telugu

మెగ్నీషియం పుష్కలంగా ఉండే నువ్వులు గుండె ఆరోగ్యానికి మేలుచేస్తాయి. నల్లనువ్వులని రోజుకి ఓ రెండు గ్రాములు తీసుకున్నా గుండె కవాటాలు మూసుకుపోయే సమస్య కొంతవరకూ ఉపశమిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి

TV9 Telugu

నువ్వుల్లో కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, ఐరన్, కాపర్, సెలీనియం, ప్రొటీన్లతో పాటు, గామా ట్రాపికల్ (విటమిన్ E), B1, B3, B6 కూడా అధికంగా ఉంటాయి

TV9 Telugu

ముఖ్యంగా నువ్వులను చలికాలంలో తప్పనిసరిగా తినాలి. చలికాలంలో నువ్వులు తీసుకోవడం వల్ల చలికాలంలో శరీరం వెచ్చగా ఉంటుంది. నువ్వుల్లో ప్రోటీన్ కాకుండా కండరాలు, ఎముకలకు ప్రయోజనకరమైన అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి

TV9 Telugu

ఇందులోని పోషకాలు శీతాకాలంలో కండరాలు, కీళ్లలో నొప్పిని నివారిస్తుంది. విటమిన్ ఇ, ప్రొటీన్‌లతో పాటు, నువ్వులలో చర్మానికి మేలు చేసే మంచి కొవ్వులు కూడా ఉంటాయి. నువ్వులను రోజూ తీసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది

TV9 Telugu

ఇందులోని పోషకాలు శీతాకాలంలో కండరాలు, కీళ్లలో నొప్పిని నివారిస్తుంది. విటమిన్ ఇ, ప్రొటీన్‌లతో పాటు, నువ్వులలో చర్మానికి మేలు చేసే మంచి కొవ్వులు కూడా ఉంటాయి. నువ్వులను రోజూ తీసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది