మహిళలకు గుండె జబ్బుల సమస్యలు చాలా తక్కువ..ఎందుకంటే?

16 January 2025

samatha

 చాలా వరకు గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా మగవారికే వస్తుంటాయి. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమ్య చాలా తక్కువగా ఉంటుంది.

అయితే అసలు పురుషులతో పోలిస్తే మహిళలకు గుండె జబ్బుల సమస్య చాలా తక్కువగా ఉండటానికి కొన్ని కారణాలు ఉన్నాయంట.

 కాగా, అసలు మహిళలకు గుండె సంబంధిత వ్యాధులు ఎందుకు తక్కువగా వస్తాయో, దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

స్త్రీలకు గుండె సమస్యల నుంచి వారిని ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ రక్షిస్తుందంట. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుందంట.

 అంతే కాకుండా ఈ హర్మోన్ స్త్రీలలోని రక్త నాళాల గోడలను సాఫీగా ఉంచుతుంది. దీని వలన రక్తప్రవాహం సజావుగా సాగి గుండె సమస్యలు దరి చేరవు.

 అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఈ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది. దీని వలన వీరిలో ఊబకాయం వంటి సమస్యలు ఉండవు.

అయితే ఇది ఎప్పటికీ ఇలానే ఉంటుందా? మహిళలకు గుండె సమస్యలు రావా అంటే? మోనోపాజ్ వయసు వరకే స్త్రీలకు ఈస్ట్రోజెన్ రక్షణ కవచంలా పనిచేస్తుంది.

రుతుక్రమం ఆగిపోయే వయసు వచ్చిన తర్వాత గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని,పురుషులతో సమానంగా ప్రమాదం ఉంటుందంటున్నారు వైద్యులు.