మనం రెగ్యులర్‌గా వాడే తెల్ల ఉప్పు కంటే కూడా బ్లాక్ సాల్ట్ ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది. ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు అధికంగా ఉండి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఇది ఆహారం రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగు పరచడంలో ఈ నల్ల ఉప్పు చాలాబాగా పనిచేస్తుంది.
నల్ల ఉప్పును తీసుకుంటే ఆరోగ్యానికే కాదు చర్మానికి, జుట్టుకు కూడా మంచిది. నల్ల ఉప్పు కలిపిన నీళ్లతో స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి
గ్యాస్ ,అసిడిటీ వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి నల్ల ఉప్పు మంచి ఉపశమనం అందిస్తుంది. కాలేయ ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
గ్యాస్ ,అసిడిటీ వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి నల్ల ఉప్పు మంచి ఉపశమనం అందిస్తుంది. కాలేయ ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
చెడు కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారికి చాలా మంచిది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.
గోరువెచ్చని నీటిలో నల్ల ఉప్పు వేసి నిద్రించే ముందు పుక్కిలిస్తే దంతాలు బలపడతాయి. దీంతో పంటి నొప్పి, కుహరం సమస్యలు కూడా నయం అవుతాయి.
నల్ల ఉప్పు కలిపిన నీళ్లతో స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి. నల్ల ఉప్పును జుట్టుకు, చర్మానికి మంచిది. సబ్బులూ, టూత్ పేస్ట్ ల తయారీలోనూ వాడుతుంటారు.