పొన్నగంటి కూర, దీనిని చెన్నగంటి కూర అని కూడా పిలుస్తారు. ఇది అమరాంథేసి కుటుంబానికి ఒక రకమైన ఆకుకూర. భారతదేశంలోని చాలా ప్రాంతాలలో లభిస్తుంది.
ఇది చాలా పోషకమైన కూర, ఇందులో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈ పొన్నగంటి కూర ఆకులు కేవలం ఏడాది పొడవునా లభిస్తాయి.
పొన్నగంటి ఆకులో బి6, సి, ఏ విటమిన్లతోపాటు రైబోఫ్లవిన్, ఫొలేట్, మెగ్నీషియం, ఇనుము, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుంది.
పొన్నగంటి ఆకులో బి6, సి, ఏ విటమిన్లతోపాటు రైబోఫ్లవిన్, ఫొలేట్, మెగ్నీషియం, ఇనుము, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుంది.
ఇందులో లభించే కాల్షియం ఎంతో దోహదపడుతుంది. అలాగే ఆస్టియోపోరోసిస్ వంటివాటిని కూడా పొన్నగంటి కూర దూరం చేస్తుంది. బరువుతో పాటు, క్యాన్సర్ కారకాలను నియంత్రిస్తుంది.
పొన్నగంటి కూరను తింటే పురుషులకు కావల్సిన శక్తి సమకూరుతుంది. ఈ కూర వారిలో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. జీవక్రియలోని లోపాలను కూడా సరిచేస్తుంది.
ఒక టేబుల్ స్పూన్ తాజా రసంలో వెల్లుల్లి కలిపి తీసుకుంటే దీర్ఘకాలింగా వేధించే దగ్గు, ఆస్తమా తగ్గుతాయి. నరాల్లో నొప్పికి, వెన్ను నొప్పి కూడా ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.
కందిపప్పు, నెయ్యితో పొన్నగంటి కూరను తీసుకుంటే సన్నగా ఉండేవారు బరువు పెరుగుతారు. అలాగే ఆకును ఉడికించి మిరియాల పొడి, ఉప్పు కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు.