దానిమ్మతో గుండె పదిలం.. తింటే ఎంత మంచిదో?

Samatha

14 august  2025

Credit: Instagram

దానిమ్మ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే  ప్రతి రోజూ ఒక దానిమ్మ పండు తినడం వలన గుండె ఆరోగ్యం బాగుంటుందంట.

దానిమ్మలో పోషకాలు అధికంగా ఉంటాయి. అందువలన దీనిని తినడం వలన శరీరానికి చాలా ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

చాలా మంది దానిమ్మను జ్యూస్ లేదా  గింజలను తింటుంటారు. అయితే ఇందులో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉండటం వలన శరీరానికి చాలా మంచిదంట.

యాంటీ ఆక్సిడెంట్స్  అని పిలవబడే కొన్ని సమ్మెళనాలు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వలన కలిగే నస్టం నుంచి రక్షిస్తాయి.

దానిమ్మ పండు తినడం వలన టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్, శరీరంలోని వాపు వంటి సమస్యల నుంచి కాపాడుతుంది.

దానిమ్మ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఛాతినొప్పిని ఎదుర్కొవడానికి చాలా సహాయపడుతుంది. గుండెను కాపాడుతుంది.

దానిమ్మ కిడ్రీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని ప్రతి రోజూ తినడం వలన ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటాన్ని తగ్గిస్తుంది.

దానిమ్మ మెదడు కణాలను రక్షిస్తుంది. ఈ పండ్లు ఆక్సికరణ నష్టాన్ని తగ్గించి, మెదడు కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.