ఈ సమస్యలు ఉన్నవారు గుడ్డు తింటే.. అనారోగ్యాన్ని పాకెట్‎లో పెట్టుకున్నట్టే..

01 September 2025

Prudvi Battula 

ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు పుష్కలంగా ఉంటే గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ఆమ్లెట్, హాఫ్ బాయిల్డ్, ఉడికించి తింటుంటారు.

చాలా మంది ఉదయం అల్పాహారం మొదలుకుని సాయంత్రం స్నాక్స్ వరకూ ఏ సమయంలో అయినా గుడ్లను తినేందుకు ఇష్టపడతారు.

వాస్తవానికి గుడ్లు తినడం ఆరోగ్యమే అయినప్పటికీ.. కొందమందికి మాత్రం ఇది హాని కలిగిస్తుందని అంటున్నారు నిపుణులు.

జీర్ణక్రియ సరిగా లేని వ్యక్తులు గుడ్లు తినకూడదు. ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి ఉన్నవారు తింటే కడుపులో భారంగా అనిపిస్తుంది.

గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు గుడ్లకు దూరంగా ఉండటమే మంచిది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. అలాగే రక్త ప్రసరణలో అడ్డంకిని కలిగిస్తుంది .

గుడ్లలో ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నందున బరువు తగ్గించేందుకు అవి ఉపయోగపడతాయని నమ్మితే పొరపాటే. ఇందులో ఉండే ప్రోటీన్, కొవ్వులు బరువును మరింత పెంచుతాయి.

గుడ్లు ప్రోటీన్‎కు మంచి మూలం. వీటిని అధికంగా తింటే మూత్రపిండాలు దెబ్బతింటాయి. కాబట్టి కిడ్నీ సమస్యలు ఉంటే గుడ్లు తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి.

చర్మ సంబంధిత సమస్యలతో బాధపడేవారు గుడ్లు తినకూడదు. వీటిలో వేడి స్వభావం ఉన్నందున చర్మనికి హానికరం అంటున్నారు నిపుణులు.