వీరు డ్రాగన్ ఫ్రూట్ తింటే.. అనారోగ్యంతో డ్యూయెట్ వేసినట్టే.. 

09 August 2025

Prudvi Battula 

అలెర్జీ సమస్య ఉన్నవారు డ్రాగన్ ఫ్రూట్ తింటే దద్దుర్లు, దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను కలిగిస్తుంది.

డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇది ఉబ్బరం, గ్యాస్, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు వస్తాయి.

ఇప్పటికే కొన్ని సమస్యలకు మెడికేషన్ తీసుకొంటున్నవారు డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవద్దు. ఇది వారి రక్తాన్ని పలుచన చేస్తుంది.

డ్రాగన్ ఫ్రూట్‌లో ఉన్న సహజ చక్కెరలు ఉన్నందున డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.

కడుపు సంబందించిన సమస్యలు ఉన్నవారి డ్రాగన్ ఫ్రూట్ తింటే కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి.

డ్రాగన్ ఫ్రూట్‌లో కేలరీలు, చక్కెర అధికంగా ఉన్నందున అధిక బరువు సమస్య ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి. లేదంటే సమస్య పెరుగుతుంది.

గట్ సమస్యలు ఉన్నవారు డ్రాగన్ ఫ్రూట్‌ తింటే ఇందులో అధిక ఫైబర్, చెక్కరలు కారణంగా గట్ బాక్టీరియాలో మార్పులు, అసౌకర్యం కలగవచ్చు.

కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా డ్రాగన్ ఫ్రూట్‌ తినవద్దు. ఇందులో అధిక ఫైబర్, పొటాషియం కంటెంట్ వ్యాధిని మరింత పెంచవచ్చు.