వారు కాలీఫ్లవర్ తింటే.. అనారోగ్యాన్ని ఆఫర్‎లో తెచ్చుకున్నట్టే..

10 October 2025

Prudvi Battula 

కాలీఫ్లవర్‌లో రాఫినోస్ అనే సంక్లిష్ట చక్కెర ఉంటుంది. ఇది కొంతమందికి జీర్ణం కావడానికి కష్టంగా ఉంటుంది. దీని వలన గ్యాస్, ఉబ్బరం, అసౌకర్యం కలుగుతాయి.

కాలీఫ్లవర్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొంతమందిలో విరేచనాలు, మలబద్ధకం లేదా కడుపు తిమ్మిరి వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.

ఇందులో గాయిట్రోజెన్‌లు హైపోథైరాయిడిజం వంటి పరిస్థితులను మరింత దిగజార్చుతాయి. థైరాయిడ్ ఉన్నవారు దీని జోలికి వెళ్ళకూడదు.

కొంతమందికి కాలీఫ్లవర్ అలెర్జీ కావచ్చు. ఇది దద్దుర్లు, దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను కలిగిస్తుంది.

దీనిలో విటమిన్ కె అధికంగా ఉన్నందున వార్ఫరిన్ వంటి రక్తాన్ని పలుచబరిచే సమస్యను పెంచుతుంది. రక్త సమస్యలు ఉన్నవారు ఇది తినకూడదు.

కాలీఫ్లవర్‌లో ఆక్సలేట్‌లు కొంతమందిలో మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే కిడ్నీ సమస్యలు ఉన్న ఇది తినకూడదు.

కాలీఫ్లవర్ ఎక్కువగా తినేటప్పుడు కొంతమందిలో కడుపు నొప్పి, వికారం, వాంతికి కారణమవుతుంది. ఇలాంటి సమస్య ఉన్న దీన్ని దూరం పెట్టండి.

కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా ఆర్థరైటిస్ వంటి పరిస్థితులు ఉన్నవారు కాలీఫ్లవర్ తింటే మంటను మరింత పెంచుతుంది.