ఆకుపచ్చ ముత్యాల్లా ఎంతో అందంగా ఉండే పచ్చి బఠాణి చూస్తుంటేనే నోట్లో వేసుకోబుద్ధేస్తుంది. బఠాణీలను క్యాలీఫ్లవర్, క్యాబేజ్, బంగాళదుంప, క్యారెట్.. ఇలా దేనితో కలిపి వండినా వాటి రుచి రెట్టింపవుతుంది
TV9 Telugu
పచ్చి బఠాణీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎర్రరక్త కణాలు వృద్ధిచెందడంలో, శరీరం అంతటికీ ప్రాణవాయువును అందజేయడంలో తోడ్పడతాయి. రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధం చేస్తాయి
TV9 Telugu
పచ్చి బఠాణీలు వింటర్ సీజన్‌లో అధికంగా వస్తాయి. చాలా మంది ఈ పచ్చి బఠాణీలు చాలా మంది ఇష్టంగా తింటారు. బఠాణీలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. తరచుగా బఠాణీలు తినేవారికి క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ
TV9 Telugu
వీటిలో ఉన్న సెపోనిన్స్ ద్రవ్యాలు క్యాన్సర్ నుంచి రక్షణనిస్తాయి. బఠాణీల్లో ఉన్న యాంటీబాక్టీరియల్, యాంటీఫంగల్ గుణాలు శరీరంలో చేరిన సూక్ష్మ క్రిములను నశింపచేస్తాయి. వీటిల్లో ఉండే కెరొటినాయిడ్స్, జిక్సాందౌథిన్లు కళ్లకు దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కాపాడతాయి
TV9 Telugu
పచ్చి బఠాణీలలో ప్రోటీన్, విటమిన్ B6, ఫైబర్, సోడియం, ఐరన్, కాల్షియం, యాంటీ-ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. చలికాలంలో పచ్చి బఠానీలు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు
TV9 Telugu
బరువు తగ్గడానికి పచ్చి బఠాణీలను తినవచ్చు. ఇందులో ఫైబర్ ఉంటుంది. అందుకే వీటిని తింటే పొట్ట ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. బఠానీలలో మెగ్నీషియం, యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. మీకు చెడు కొలెస్ట్రాల్ సమస్య ఉంటే, పచ్చి బఠాణీలను తినడం ప్రారంభించవచ్చు. ఇవి ఒంట్లో కొవ్వును వేగంగా కరిగిస్తాయి
TV9 Telugu
పచ్చి బఠాణీలలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. వీటిల్లోని యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి