భూతల స్వర్గమే ఈ ప్రదేశం.. వర్షాకాలంలో ముక్కా జలపాతం చూడాల్సిందే..
13 August 2025
Prudvi Battula
ముఖ జలపాతం భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో ఉన్న ఒక అద్భుతమైన జలపాతం. ఇది బెలన్ నదిపై ఉంది.
ముఖ జలపాతం రాబర్ట్స్‌గంజ్‌కు పశ్చిమాన దాదాపు 55 కిలోమీటర్లు సోన్‌భద్ర జిల్లాలోని ఘోరవాల్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇవి దేవి మందిర్, కరియా తాల్ దగ్గర్లో ఉన్నాయి. దేశంలో అత్యంత అద్భుతమైన జలపాతాలలో ఒకటి. ముఖ్యంగా వర్షాకాలంలో చాల అద్భుతంగా ఉంటుంది.
దీని చుట్టుపక్కల పురాతన రాతి కళను కలిగి ఉన్న లఖానియా గుహ చిత్రాలు, పంచముఖి మహాదేవ్ ఆలయం, సన్ ఎకో పాయింట్, జ్వాలాముఖి శక్తిపీఠ్ వంటివి చూడవచ్చు.
సోన్‌భద్ర నుంచి టాక్సీలు, బస్సులు, ఆటోల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. మీ సొంత వాహనం ద్వారా వెళ్దాం అనుకొన్న పర్వాలేదు.
వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం సమీప దీనికి విమానాశ్రయం. ఇది సోన్‌భద్రకు ఉత్తరాన దాదాపు 118 కిలోమీటర్ల దూరంలో ఉంది.
సోన్‌భద్రలో ప్రజా రవాణా పరిమితంగా ఉండటం వలన మీరు ముఖ జలపాతాలకు కారు లేదా బైక్‌లో ప్రయాణించడం మంచిది.
మీరు జలపాతాలు, దాని పరిసరాలను అన్వేషించడానికి దాదాపు 1-2 గంటలు గడపవచ్చు. సుందరమైన అందాలను ఆస్వాదించాలంటే నడుచుకొంటూ వెళ్లి జలపాతం దగ్గర విశ్రాంతి తీసుకోండి.