త్వరలో రైల్వే కొత్త రూల్స్.. తొలి 15 నిమిషాలు వారికే బుకింగ్ అవకాశం..

16 September 2025

Prudvi Battula 

దేశవ్యాప్తంగా ప్రతిరోజూ వేలాదిమంది ప్రజలు ట్రైన్ జర్నీ చేస్తారు. ఇది సామాన్య ప్రజలను తక్కువ ఖర్చుతో వారి గమ్యస్థానాలకు చేర్చుతుంది.

ట్రైన్ ట్రావెల్ ఖర్చు తక్కువగా ఉన్నందున టికెట్స్ ముందుగా బుక్ చేయకుంటే దొరకడం కష్టంగా మారుతుంది. తత్కాల్ ఉన్నప్పటికీ టికెట్ దొరకవవు.

చాలామంది ఆన్‌లైన్‎లో టికెట్స్ బుక్ చేసుకొంటారు. దీని కోసం IRCTC సైట్, కొన్నిరకాల మొబైల్ యాప్స్ ఉపయోగిస్తుంటారు.

అయితే ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‎లో భారతీయ రైల్వే కొత్త రూల్స్ తీసుకొని వచ్చింది. ఇవి అక్టోబర్ 1 నుంచి అమలు కానున్నాయి.

ఇక నుంచి ఆన్‌లైన్‎లో ట్రైన్ టికెట్స్ బుక్ చెయ్యాలంటే ఆధార్ ధ్రువీకరణ కంపల్సరీ చేసింది ఇండియన్ రైల్యే సంస్థ.

ఆధార్ నమోదు ప్రక్రియ పూర్తీ చేసిన వ్యక్తులకు మాత్రమే రిజర్వేషన్ ప్రారంభమైన తర్వాత మొదటి 15 నిమిషాల్లో టికెట్ బుక్ చేసుకొనే అవకాశం ఉంటుంది.

ఇప్పటి వరకు IRCTC వెబ్‌సైట్, మొబైల్ యాప్ రెండింటిలోనూ తత్కాల్‌ బుకింగ్‌‎కి మాత్రమే ఉన్న ఈ రూల్ అక్టోబర్‌ 1 నుంచి సాధారణ రిజర్వేషన్లకు కూడా వర్తిస్తుంది.

నిజమైన ప్రయాణీకులకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుంది IRCTC. బుకింగ్‌ మొదలైన 15 నిమిషాల తర్వాత మాత్రమే ఏజెంట్లుకు, ఇతర వ్యక్తులకు బుకింగ్ చేసుకొనే అవకాశం ఉంటుంది.