షుగర్ అవసరం లేదు.. టేస్టీ కొబ్బరి లడ్డు ఇంట్లినే సిద్ధం..
06 October 2025
Prudvi Battula
కొబ్బరి లడ్డూ తయారీ కోసం రెండు కప్పుల తురిమిన కొబ్బరి, ఒక కప్పు నానాబెట్టిన ఖర్జూరం, 1/4 కప్పు బాదం, అర టీ స్పూన్ యలకుల పొడి,1-2 టేబుల్ స్పూన్ల నెయ్యి కావాలి.
ముందుగా నానబెట్టిన ఖర్జూరాలను గింజలను తీసి మిక్సీలో మెత్తని పేస్టులా చేసుకొని పక్కన పెట్టాలి. ఇది సహజ స్వీటెనర్‌గా పని చేస్తుంది.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకొని తక్కువ ఫ్లేమ్‌లో తురిమిన కొబ్బరిని 3-4 నిమిషాల పాటు తేలికపాటి వాసన వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత అదే ఫ్యాన్ డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. రుచి కోసం యాలకుల పొడి, ఖర్జూరం పేస్ట్ కలపాలి. మిశ్రమం చిక్కబడే వరకు బాగా కలుపుతూ ఉండాలి.
తర్వాత చేతులకు కొంచెం నెయ్యి రాసుకుని చిన్న చిన్న లడ్డూలుగా చేసుకొని ఓ ప్లేట్‌లో పెట్టి, కొద్దిసేపు చల్లారనివ్వాలి. అంతే రెసిపీ సిద్ధం.
ఈ లడ్డూలు చాలా రుచికరంగా ఉంటాయి. అలాగే ఆరోగ్యం కూడా. మీ అందరికి ఆరోగ్యకరమైన కొబ్బరి లడ్డూలు నచ్చుతాయి.
ఇంకెందుకు ఆలస్యం మంచి రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే కొబ్బరి లడ్డులను మీ ఇంట్లోనే చేసుకొని ఆస్వాదించండి.
ఈ షుగర్ లెస్ కొబ్బరి లడ్డు మీ బంధువులకు విందు భోజనాల్లోనే వడ్డించవచ్చు. అలాగే కానుకలుగా కూడా ఇవ్వొచ్చు.