పాలతో కలిపి మఖానా తినడం వలన ఎన్ని లాభాలో తెలుసా?

samatha

08 september 2026

Pic credit - Pinterest

మఖానా అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరూ మఖాను రక రకాల ఆహారంగా తీసుకుంటారు.

అయితే అన్నింటికంటే, మఖానాను పాలల్లో వేసుకొని తినడం వలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.

కాగా, ఇప్పుడు మనం ముఖానా పాలల్లో వేసుకొని తినడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం.

పాలు, మఖానాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన ఈ రెండు కలిపి తీసుకోవడం వలన శరీరానికి చాలా పోషకాలు అందుతాయంట.

మఖానాలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఇందులో ఉంటాయి.

పాల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రోటీన్‌కు మంచి వనరు. అందువలన ఈ రెండు కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదంట.

ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వలన ఎముకల బలానికి అలాగే , కండరాల పోషణకు ఎంతోగానో ఉపయోగపడుతుందంట.

అంతే కాకుండా, మఖానాలో ఉండే కార్బోహైడ్రేట్స్ జీర్ణక్రియను మెరుగు పరిచి, పేగు ఆరోగ్యాన్ని కాపాడతాయంట.