మహాత్మాగాంధీకి ఇష్టమైన సాంగ్ ఇదే.. ప్రతి రిపబ్లిక్ డేకు ఈ పాట ప్లే కావాల్సిందేనంట!
samatha.j
25 January 2025
Credit: Instagram
జనవరి 26న రాష్ట్రపతి భవన్ నుంచి గణతంత్ర దినోత్స వేడుకలు అంగ రంగ వైభవంగా ప్రారంభం అవుతాయన్న విషయం తెలిసిందే.
ఈ వేడుకలు జాతీయ గీతంతో మొదలు అవుతాయి. అలాగే ఆ రోజు గౌరవ సూచకంగా వేడుక ప్రాంగణంలో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
మరీ ముఖ్యంగా 1941లో తయారైన, 25 పాండోర్స్ అని పిలిచే భారత సైన్యానికి సంబంధించిన 7 ఫిరంగులను మూడు రౌండ్లలో కాల్చుతారు.
గన్ సెల్యూట్ ఫైరింగ్ ద్వారా జాతీయ గీతాలాపన చేస్తారు. అలాగే,ఇండియా గేట్ ఆవరణంలో ఆర్మికి చెందిన సాయుధ వాహనాలు, ఆధునాతన పరికరాలను ప్రదర్శించడం జరుగుతుంది.
అంతే కాకుండా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆకాశంలోకి ఆర్మీ విమానాలను ప్రదర్శించడం లాంటివి కూడా చేస్తారు.
అయితే ఈ రిపబ్లిక్ డే రోజూ తప్పకుండా ఓ సాంగ్ మాత్రం ప్లే చేయడం జరుగుతుందంట. అది మహాత్మాగాంధీకి చాలా ఇష్టమైన పాట.
ఇంతకీ ఆ పాట ఏమిటంటే. "అబిడ్ విత్ మీ" అనే సాంగ్.. ఇది గాంధీకి చాలా ఇష్టమని ప్రతి గణతంత్ర దినోత్సవ వేడుక రోజు ప్లే చేసేవారు.
కానీ ప్రస్తుతం ఆ పాటను కేంద్ర ప్రభుత్వం నిలిపి వేసింది. అందువలన ఆ సాంగ్‌ను గత కొన్ని రోజుల నుంచి ప్లే చేయడం లేదని సమాచారం.