కారులో వాటర్ బాటిల్ ఉంచితే.. ఆరోగ్యాన్ని రిస్క్‎లో పెట్టినట్టే.. 

08 October 2025

Prudvi Battula 

కారులో ట్రావెల్ చేసినప్పుడు ఒకసారి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ సీల్ ఓపెన్ చేసి నీరు తాగితే చేతులు, నోరు, గాలి ద్వారా బ్యాక్టీరియా లోపలికి చేరిపోతుంది.

ఇలా బ్యాక్టీరియా చేరిన బాటిల్‎లో నీరు తాగడం వల్ల వికారం, తలనొప్పి, అలసట, కడుపు తిమ్మిరి, వాంతులు, విరేచనాలు, ఇతర జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి.

ఇలాంటి వాటర్ తాగితే శిశువులు, చిన్న పిల్లలు, వృద్ధులు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న వారిపై ఎక్కువ ప్రభావం ఉంటుంది.

మనం తాగే వాటర్ బాటిల్ పాలీ ఎథలీన్ టెరెఫ్త్​లతో చేస్తారు. వీటిని వేడి వాతావరణం, సూర్యకాంతిలో ఉంచితే బీపీఏ, ఇతర రసాయనాలను విడుదల చేస్తాయి.

కారులో ట్రావెల్ చేసినంత సేపూ ఏసీ ఆన్​లో ఉన్నందున నీరు చల్లగా ఉంటుంది. కానీ ఏసీ ఆఫ్ చేసినా పార్క్ చేసిన తర్వాత ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగిపోతుంది.

కొన్నిసార్లు కారు పార్కింగ్‎లో ఉన్నప్పుడు ఉష్ణోగ్రత 70 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉంటుంది. అంత వేడిలో ఉన్న ప్లాస్టిక్ బాటిల్‌లో నీటిని తాగడం హానికరం.

కారులో జర్నీ చేస్తూ వాటర్ బాటిల్ కొనే ముందు సీల్ చెక్ చేయడంతో పాటు గడువు ఎంతవరకు ఉందొ తెలుసుకోవడం చాలా ముఖ్యం.

అవకాశం ఉన్నంత వరకు కారులో వెళ్ళినప్పుడు గాజు, రాగి వంటి వాటితో చేసిన సీసాలో నీటిని ఉపయోగించడం మంచిది.