షుగర్ పేషెంట్లకు వరం.. ఈ పండు రోజూ తింటే ఎన్ని లాభాలో..

Samatha

19 september 2026

Pic credit - Pinterest

నలుపు రంగులో చిన్నగా కనిపించే ఈ పండును చాలామంది తక్కువ అంచనా వేస్తారు. కానీ ఆయుర్వేదంలో నేరేడు పండుకు ఉన్న ప్రాముఖ్యత తెలిస్తే షాక్ అవుతారు.

నలుపు రంగు పండ్లు

నేరేడు పండ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ పండ్లను తినాలని చెబుతారు.

నేరేడు పండ్లు

కానీ కొంత మంది నేరేడు పండ్లు తినడానికి ఆసక్తి చూపరు. కానీ ప్రతి రోజూ కాకపోయినా కనీసం వారంలో రెండు సార్లు ఈ పండ్లు తిన్న బోలెడు లాభాలు ఉన్నాయంట.

తినడం ఇష్టపడరు

కాగా, ఇప్పుడు మనం నేరేడు పండ్లు తినడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీని వలన కలిగే అద్భుతమైన లాభాలు ఏవో చూద్దాం.

ప్రయోజనాలు

నేరేడు పండ్లు ముఖ్యంగా షుగర్ పేషెంట్స్‌కు వరం అని చెప్పాలి. వీటి గింజల్లో జంబోలిన్ అనే పదార్థం ఎక్కువ మొత్తంలో ఉంటుంది.

షుగర్ పేషెంట్స్

అయితే వీటిని తినడం వలన ఇది రక్తంలోని చక్కర స్థాయిలను చాలా వరకు అదుపులో ఉంచుతుంది. అందుకే షుగర్ ఉన్నవారు వీటిని తప్పక తినాలి అంటారు.

చక్కెర స్థాయిలు కంట్రోల్

అంతే కాకుండా ఇవి జీర్ణసమస్యలను కూడా తరిమికొడతాయి. ఈ పండ్లలో ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉండటం వలన ఇవి మలబద్ధకం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.

జీర్ణ సమస్యలు

అంతే కాకుండా నేరేడు పండ్లలో ఐరన్ ఎక్కువగా ఉండటం వలన ఇది రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

రక్తహీనత దూరం