పచ్చి గుడ్డు తీసుకోవడం సురక్షితమేనా.? నిజం ఏంటి.?
07 October 2025
Prudvi Battula
చాలామంది వ్యాయామం చేసినప్పుడు పచ్చి గుడ్లకు తాగడం చూసే ఉంటారు. ఇండ్ల కండరాలు బలంగా మారుతాయని అంటారు.
నిజానికి పచ్చిగుడ్డు కంటే ఉడికించిన గుడ్డు తినడమే సురక్షితం. ఇందులోనే ఎక్కువ పోషకాలు లభిస్తాయని వైద్యులు అంటున్నారు.
పచ్చిగుడ్డు అధికంగా తాగడం వల్ల ఎలాంటి లాభలు లేకపోగా మరిన్ని సమస్యలు వస్తాయని అంటున్నారు పోషకాహార నిపుణులు.
పచ్చిగా లేదా సగం ఉడికించిన గుడ్లలో ఉన్న సాల్మొనెల్లా బాక్టీరియా కడుపు నొప్పి, విరేచనాలు, జ్వరం, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలను తెస్తుంది.
పచ్చి గుడ్డులో అవిడిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది విటమిన్ బి7 శోషణను అడ్డుకుంటుంది. అందుకే గుడ్డును ఉడికించి తినడమే మంచిది.
సౌందర్యం కోసం అయితే పచ్చి గుడ్డును నేరుగా చర్మం లేదా జుట్టుపై అప్లై చేయవచ్చు. ఇది చర్మానికి, జుట్టుకు మేలు చేస్తుంది.
ఉడికించిన గుడ్డులో కేలరీలు తక్కువగా ఉన్నందున బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కానీ నూనె లేదా మసాలాలతో తింటే అన్ని లాభాలు ఉండవు.
గుడ్డు పోషకాలు అలానే ఉండాలంటే 10-12 నిమిషాలు పాటూ ఉడికించాలి. దీనివల్ల గుడ్డులోని బాక్టీరియ పోయి పోషకాలు మాత్రమే ఉంటాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇంటి ముందు కొబ్బరి చెట్టును పెంచవచ్చా.? పండితుల మాటేంటి.?
ఫ్రెంచ్ ఫ్రైస్తో షుగర్ వస్తుందా.? పరిశోదనలు ఏం చెబుతున్నాయి.?
పీతలను డైట్లో చేర్చుకున్న ఆదిలాబాద్ ప్రజలు.. కారణం అదేనా.?