ప్రెగ్నెంట్ టైమ్‌లో చికెన్ తినొచ్చా? నిపుణులు ఏమంటున్నారంటే?
Samatha
9 july 2025
Credit: Instagram
చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. చాలా మంది లొట్టలేసుకొని మరి చికెన్ తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు.
కొంత మంది వారానికి ఒకసారి చికెన్ తింటే మరికొంత మంది మాత్రం, వారంలో రెండు సార్లు ఇలా చికెన్ తింటారు.
ఇక కొన్ని రకాల వ్యాధులతో బాధపడే వారు చికెన్ తినకూడదని వైద్యులు సూచిస్తుంటారు. దీంతో చాలా మంది చికెన్ తినే విషయంలో ఎక్కువగా ఆలోచిస్తుంటారు.
అయితే కొన్ని సార్లు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చికెన్ తినవచ్చా? లేదా అనే అనుమానం కలుగుతుంటుంది. కొందరైతే చికెన్ తినొద్దు మటన్ తినాలంటారు. కాగా దీని గురించి తెలుసుకుందాం.
గర్భిణీలు చికెన్ తినడం చాలా మంచిదంట. చికెన్‌లో మంచి ప్రోటీన్ ఉంటుంది. అందువలన దీనిని తినడం వలన ఇది బిడ్డ వృద్ధికి దోహదం చేస్తుంది.
అలాగే చికెన్‌లో ఐరన్ కాల్షియం, ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి బిడ్డ పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతాయంట.
అంతే కాకుండా ప్రెగ్నెంట్ లేడీస్ చికెన్ తినడం వలన ఇవి వారిలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి.దీనిలో విటమిన్స్ శిశువు మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
అయితే చికెన్ తినేటప్పుడు మాత్రం ప్రెగ్నెంట్ ఉమెన్స్ బాగా ఉడికినది తినాలంట,మసాలా, ఫ్రై చేసిన చికెన్ వంటివి తినకూడదంట.