వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది ఫుడ్ విషయంలో చాలా ఆలోచిస్తుంటారు. శరీరానికి శక్తినిచ్చే ఫుడ్ తీసుకోవడంపై శ్రద్ధపెడతారు.
కొంత మంది రోజూ ఉదయం అల్పాహారంగా డ్రై ఫ్రూట్స్ మాత్రమే తింటుంటారు. అయితే కొందరు మఖానా వర్షాకాలంలో తినవచ్చా?
ఈ సీజన్‌లో మఖానా తినడం వలన ఏవైనా సమస్యలు వస్తాయా? లేదా వర్షకాలంలో మఖానా తింటే ఆరోగ్యానికి మంచిదేనా అనే అనుమానం ఉంటుంది. కాగా, దాని గురించి తెలుసుకుందాం.
మఖానా పోషకాల గని అంటారు. అయితే దీనిని వర్షాకాలంలో తినడం వలన కూడా ఎలాంటి సమస్యలు ఉండవంట. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంట.
వర్షాకాలంలో మఖానా తినడం వలన ఇందులో ఉండే అధిక ఫైబర్, జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేసి, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుందంట.
అలాగే వర్షాకాలంలో చాలా మంది బరువు పెరుగుతారు. కానీ, ఈ సీజన్‌లో మఖానా తినడం వలన ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుందంట.
అదే విధంగా మఖానాలో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉండటం వలన ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా రక్తపోటును తగ్గిస్తుంది.
ఎముకల దృఢత్వానికి మఖానా చాలా మంచిది. మఖానాలో కాల్షియం పుష్కలంగా ఉండటం వలన ఇది ఎముకలను బలంగా చేస్తుందంట.