ఇంట్రెస్టింగ్.. రిపబ్లిక్ డే గురించి ఈ విషయాలు తెలుసా?

samatha.j

24 January 2025

Credit: Instagram

రిపబ్లిక్ డే వచ్చేస్తుంది. జనవరి 26న మన దేశం అంతటా గణతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.

కాగా, ఈ  రిపబ్లిక్ డేకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1950 జనవరి 26 భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. అప్పటి నుంచి మనం గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్నాం.

1950 నుంచి 1954 వరకు గణతంత్ర దినోత్సవ వేడుకలను వరసగా, నేషనల్ స్టేడియం, ఎర్రకోట, రామ్ లీలా, కింగ్స్ వే‌లో నిర్వహించేవారంట.

ప్రతి రిపబ్లిక్ డే ఈవెంట్‌కు ప్రధాని, రాష్ట్రపతి లేదా ఇతర దేశాల ప్రముఖులు ముఖ్య అతిథులుగా వస్తుంటారు.

కాగా,1950లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు డాక్టర్ సుకర్నోన ముఖ్య అతిథిగా వచ్చారు.

తర్వాత 1955 గణతంత్ర వేడుకులకు పాకిస్తాన్ గవర్నర్ జనరల్ మాలిక్ గుమాల్ మహమ్మద్‌ ముఖ్య అతిథిగా వచ్చారు.

ఇక ఇప్పుడు గణతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్రపతి భవనంలో నిర్వహిస్తున్నారు. జాతీయ గీతంతో ఈ వేడుకలు మొదలు అవుతాయి.