ఆ అందం మళ్లీ తిరుగొచ్చేనా.. పూర్తిగా మారిపోయిన సమంత, న్యూలుక్ ఫోటోస్ వైరల్!
samatha.j
23 January 2025
Credit: Instagram
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
ఇక ఏమాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ బ్యూటీ అనతి కాలంలో స్టార్ స్టేస్ అందుకుంది.
అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ, వివాహమైన నాలుగు సంవత్సరాలకే, డివోర్స్ తీసుకున్న విషయం తెలిసిందే.
ఇక విడాకుల తర్వాత సమంత మానసికంగా చాలా సమస్యలను ఎదుర్కొంది. ముఖ్యంగా ఈ బ్యూటీని అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి.
ఇక విడాకుల తర్వాత సమంత మానసికంగా చాలా సమస్యలను ఎదుర్కొంది. ముఖ్యంగా ఈ బ్యూటీని అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి.
మయోసైటీస్ వ్యాధి బారిన పడిన ఈ ముద్దుగుమ్మ చాలా రోజుల పాటు చికిత్స తీసుకుంటూ, ఇండస్ట్రీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
అయితే ఆ తర్వాత సమంతలో చాలా మార్పులు వచ్చాయి. ఆ అమ్మడు ఎప్పుడూ నీరసం, అనారోగ్యంగా కనిపించేది, ఈవెంట్‌లకు హాజరైనా చాలా నీరసంగా ఉండేది
దీంతో చాలా మంది అభిమానులు సమంత గతంలోలాగా కాకుండా చాలా మారిపోయింది. ఆమె ఎప్పుడూ అనారోగ్యంగా కనిపిస్తుందంటూ ముచ్చటించారు.
అయితే తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేయగా అందులో సమంత చాలా యాక్టివ్‌గా అందంగా కనిపిస్తుంది. దీంతో సామ్ మళ్లీ ఎప్పటిలా అయ్యిందంటున్నారు తన ఫ్యాన్స్.