నాగు పాము కంటే ఎక్కువ విషపూరితం.. కాటు వేస్తే ఖతమే

samatha

08 september 2026

Pic credit - Pinterest

పాములు అంటే భయం లేని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరూ పాములను చూస్తే చాలు ఆమడ దూరం పారిపోతారు.

అయితే చాలా మంది నాగు పామును చూస్తే వణికిపోతుంటారు. అది చాలా విషపూరితమైన పాము అని భయపడిపోతారు.

కానీ ఇన్ ల్యాండ్ తైపాన్ నాగు పాముకంటే చాలా విషపూరితమైనదంట. దీని విషం చాలా వేగంగా వ్యాపిస్తుందంట.

అయితే ఈ పాము భారత్‌లో కనిపించదు. ఇది ఎక్కువగా ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందంట.

అంతే కాకుండా దీనిని వెస్ట్రన్ తైపాన్ అని కూడా పిలుస్తారు. అలాగే ఈ పాము చాలా వేగంతో దూసుకెళ్తుందంట.

ఇక ఈ పాము విషం ప్రధానంగా నాడీ వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది.  ఇది కాటు వేస్తే చాలా ప్రమాదకరం.

కానీ ఈ పాము ఎక్కువగా మానవులకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుందంట. నివాస ప్రాంతాల్లో  ఈ పాము ఎక్కువగా కనిపించదు.

కానీ భారత దేశంలో చాలా మంది నాగు పామును చూస్తే చాలా భయపడిపోతుంటారు. ఇదే చాలా విషపూరితమైనది అనుకుంటారు.