ఇలాంటి నంబర్స్ ATM పిన్‌గా పెట్టుకుంటే.. మీ బతుకు గుల్లే.. 

12 September 2025

Prudvi Battula 

ఈరోజుల్లో డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులతో ATMల ద్వారా డబ్బు తీసుకోవడం, ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడం, బిల్లులు చెల్లించడం  వంటివి చేస్తున్నారు.

ఇలాంటి సౌకర్యాలతో పాతునే సైబర్ నేరాలు కూడా చాలా వేగంగా పెరుగుతున్నాయి. అయితే వీటి నుంచి మన కార్డును రక్షించేది నాలుగు అంకెల పిన్ నంబర్.

చాలామంది గుర్తు ఉండటం కోసం ATM పిన్‌ సులభంగా ఉండేలా కొన్ని సాధారణ నంబర్లు పెట్టుకుంటారు. అదే హ్యాకర్లకు ప్రయోజనంగా మారుతుంది.

మీరు కొన్ని పిన్స్ పెట్టుకోవడం వల్ల మీ డబ్బు క్షణాల్లో పోతాయి. కాబట్టి ఎలాంటి పిన్‌లను వాడకూడదు, ఏవి భద్రం అన్నదానిపై అవగాహన ఉండటం చాలా ముఖ్యం.

1234 ఇది  సాధారణంగా ఎక్కువగా వాడే పిన్. 1111, 2222, 3333, 0000 పునరావృత అంకెలు. రివర్స్ ఆర్డర్ అంటే 4321,  అలాగే 1212, 1122 వంటి ప్యాటర్న్ ఆధారిత కాంబినేషన్లు పెట్టవద్దు.

మీ ATM పిన్‌గా వరుస లేదా పునరావృత సంఖ్యలు పెట్టుకొంటే మీకు సులభంగా ఉండవచ్చు. కానీ ఇది సైబర్ క్రైమ్‎కి కారణం అవుతుంది.

చాలామంది పుట్టినతేదీ లేదా సంవత్సరం ఆధారంగా పిన్ సెట్ చేస్తారు. 1508 (ఆగస్టు 15), 2511 (నవంబర్ 25). 1990, 1995, 2000 సంవత్సరాలు. ఇలాంటివి పెట్టవద్దు.

వ్యక్తిగత సమాచారం ఆధారిత నంబర్లు అంటే మొబైల్ నంబర్ చివరి నాలుగు అంకెలు, వాహన నంబర్, ఆధార్ లేదా ఐడి కార్డ్‌లోని నంబర్స్ పిన్‌గా పెట్టడం చాలా పెద్ద తప్పిదం.

గ్లోబల్‌గా అత్యంత పాపులర్ అయినా 1234, 0000, 2580, 6969, 1212,9999 వంటి కొన్న నంబర్స్ హ్యాక్ చేయడానికి సెకన్లు మాత్రమే పడతాయి.

ఇలాంటి నంబర్లు ATM పిన్‌గా పెట్టుకుంటే మీకు గుర్తుంచుకోవడానికి సులభంగా ఉన్నప్పటికీ భద్రత విషయంలో చాలా ప్రమాదకరమైనవి. అందుకే ఇలాంటివి పెట్టవద్దు.