బియ్యం ఇలా స్టోర్ చేస్తే.. పురుగులకు ఇక నో ఎంట్రీ..

10 October 2025

Prudvi Battula 

ప్రతి ఇంట్లో బియ్యం ఉండటం కామన్. ఆహారంలో ప్రధానమైన బియ్యాన్ని ఎక్కువగా నిల్వ చేసుకుంటారు. కానీ కొన్ని రోజులకి అవి పురుగులు పట్టడం ఇబ్బందిగా ఉంటుంది.

పురుగులు బియ్యం రుచి, వాసన, నాణ్యతను పూర్తిగా పాడు చేసి వంటకి వీలుకాకుండా చేస్తాయి. వాతావరణం, తేమ, నిల్వ విధానం వంటివి పురుగుల పట్టడానికి కారణం.

బియ్యంలో దాగి ఉండే పురుగు గుడ్లు తేమ, ముఖ్యంగా ఉష్ణోగ్రత పెరిగినప్పుడు పురుగులుగా మారి బియ్యం మొత్తం వ్యాపిస్తాయి.

ఈ సమస్య వేసవి కాలంలో, వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది. వీటిని సరిగా నిల్వ చేయకపోతే  రెండు వారాల్లోనే పురుగులు పట్టే ప్రమాదం ఉంటుంది.

మన పూర్వీకులు ఈ సమస్యకు రసాయనాలు లేకుండా సహజ పద్ధతులతో పరిష్కారాలు చెప్పారు. ఇవి పాటిస్తే బియ్యం నెలల తరబడి తాజాగా, సువాసనగా, రుచిగా ఉంటాయి.

ఎండిన వేప ఆకులను బియ్యంలో వేసి స్టోర్ చేస్తే.. వీటిలో క్రిమిసంహారక గుణాలు వల్ల పురుగులు దగ్గర కూడా రావంట.

ప్రతి ఐదు కిలోల బియ్యంలో నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలు వేస్తే పురుగులను దరి చేరవు. సువాసన కూడా అలాగే ఉంటుంది.

బే ఆకులు బియ్యంలో పురుగులు తరమడానికి చాలా బాగా పని చేస్తాయి. ఇవి సహజంగాగానే కీటకాలను బియ్యం నుంచి దూరంగా ఉంచుతాయి.

బియ్యం నిల్వ చేసే పెట్టెలో నాలుగు నుండి ఐదు మిరియాల గింజలను వెయ్యడం వల్ల పురుగులు వాటి పక్కకు కూడా రావు.

అలాగే నెలకు ఒకసారి బియ్యాన్ని ఎండలో ఎండబెట్టడం ముఖ్యం. ఇది తేమను తొలగించి పురుగులు రాకుండా అడ్డుకుంటుంది.