ఈ గవర్నమెంట్ యాప్స్ మీ ఫోన్లో ఉంటే.. ప్రభుత్వ సేవలన్నీ ఇంటి వద్దకే..
Prudvi Battula
30 September 2025
'BHIM (భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ)' యాప్ ద్వారా డిజిటల్‌గా డబ్బును నిర్వహించడం సులభం. థర్డ్-పార్టీ టూల్స్ లేకుండా సురక్షితంగా లావాదేవీలు, UPI చెల్లింపులు చేయవచ్చు.
'RBI రిటైల్ డైరెక్ట్' ప్రభుత్వ జర్వ్ రిబ్యాంక్ ఆఫ్ ఇండియా రూపొందించిన యాప్. దీంతో సెక్యూరిటీలలో నేరుగా పెట్టుబడి పెట్టవచ్చు.
భారతదేశం ప్రధాన ఆరోగ్య పర్యవేక్షణ యాప్ 'ఆరోగ్య సేతు'. ఇది ముఖ్యంగా COVID-19 టైంలో సమర్థవంతంగా పని చేసింది.
COVID-19 మహమ్మారి సమయంలో రూపొందించారు 'కోవిన్' యాప్. ఇది టీకా నమోదు, అపాయింట్‌మెంట్ బుకింగ్, డిజిటల్ సర్టిఫికేషన్ కోసం సహాయపడుతుంది.
వాహనం, డ్రైవర్ డేటాకు డిజిటల్ యాక్సెస్ చేయడానికి రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ 'mParivahan' యాప్ రూపొందించింది.
ఆధార్, పాన్, మార్క్‌షీట్‌ల వంటి పత్రాలను క్లౌడ్ స్టోరేజ్ కోసం సాహారపడే యాప్ 'డిజిలాకర్'. ఇందులో డాక్యూమెంట్స్ స్టోర్ చేయవచ్చు.
'UMANG (యూనిఫైడ్ మొబైల్ యాప్ ఫర్ న్యూ-ఏజ్ గవర్నెన్స్)' EPFO, పాస్‌పోర్ట్ సేవ సహా 1,200+ కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ సేవలకు యాక్సెస్‌ను అందించే వన్-స్టాప్ ప్లాట్‌ఫామ్.
భారత పౌర భాగస్వామ్య యాప్ MyGov. దీని ద్వారా ప్రజలు తన ఆలోచనలు, అభిప్రాయాలు, చర్చలు, టాస్క్‌లు నేరుగా ప్రభుత్వంతో పంచుకోవచ్చు.