మీ డైట్లో స్ట్రాబెర్రీ ఉంటే.. అనారోగ్యానికి గోరి కట్టినట్టే..
26 September 2025
Prudvi Battula
స్ట్రాబెర్రీల్లో ఉన్న విటమిన్ సి, ఎలాజిక్ ఆమ్లం, ఆంథోసైనిన్లు వంటి యాంటీఆక్సిడెంట్లతో కణాలను దెబ్బతినకుండా రక్షిస్తాయి. వాపును తగ్గిస్తాయి.
స్ట్రాబెర్రీలలోని ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేసి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు.
వీటిలో లభించే యాంటీఆక్సిడెంట్లు,ఫ్లేవనాయిడ్లు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. అలాగే మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.
దీనిలోని విటమిన్ సి చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతాయి. చర్మ ఆకృతిని మెరుగుపరచి వృద్ధాప్య సంకేతాలను దూరం చేస్తుంది.
ఇందులో విటమిన్ సి, ఆంథోసైనిన్ల కళ్ళును ఆరోగ్యంగా ఉంచుతాయి. వయస్సు-సంబంధిత మాక్యులర్ క్షీణతను దూరం చేస్తాయి.
స్ట్రాబెర్రీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వాపులను తగ్గిస్తాయి. అలాగే మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధుల నుంచి పారాడటంలో ఎంతగానో సహాయపడతాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
క్యారెట్ అంటే.. ఆ సమస్యలకు హడల్.. మీ డైట్లో ఉంటే.. నో వర్రీస్..
మునగాకు ఫ్రై రెసిపీ… టేస్ట్ మాత్రమే కాదు.. ఆరోగ్యం కూడా..
సీతాఫలం తీసుకుంటే.. ఆ సమస్యలపై వార్ డిక్లేర్ చేసినట్టే..