పచ్చి అరటి డైట్లో ఉంటే.. ఆ సమస్యలన్నీ భయంతో పరార్..
Prudvi Battula
14 September 2025
అరటికాయలను ఎక్కువగా ఫ్రై కర్రీలు, బజ్జిలు, చిప్స్ వంటి వంటకాలు తయారు చేయడానికి వినియోగిస్తారు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి.
అరటికాయల్లో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
అరటికాయ ప్రీ బయోటిక్ ఆహారం. దీన్ని తింటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.
పచ్చి అరటి మీ ఆహారంలో చేర్చుకుంటే.. శరీరంలో రోగనిరోధక శక్తి పెడుతుంది. దీని కారణం రోగాలు రాకుండా ఉంటాయి.
ఇందులో ఉండే ఫైబర్ మలబద్దకన్నీ తగ్గించి ఇతర జీర్ణ సమస్యల రాకుండా కాపాడటంలో సహాయపడుతుందని అంటున్నారు నిపుణులు.
వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది డయాబెటిస్ ఉన్నవారికి మంచి ఎంపికనే చెప్పాలి.
పచ్చి అరటి కాయల్లో అధికంగా ఉండే ఫైబర్, రెసిస్టెంట్ స్టార్చ్ కడుపు నిండిన భావన కలిగి ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తిని బరువు తగ్గుతారు.
పచ్చి అరటిలో అధిక పొటాషియం బీపీని నియంత్రించడంలో సహాయం చేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గిపోతాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ రాశుల వారు అదృష్టానికి కేరాఫ్ అడ్రస్..!
మీ బ్రష్ ఇన్ని రోజులకు మార్చితేనే మీ పళ్ళు సేఫ్..
ఇలా రెస్టారెంట్ GST స్కామ్‌ను తెలుసుకొంటే.. మీ మనీ సేవ్..