ఈ సమస్యలున్న వారు బొప్పాయి తింటే.. అంతే సంగతులు..
09 October 2025
Prudvi Battula
బొప్పాయి పండులో అనేక పోషకాలు లభిస్తాయి. వీటితో చాల ప్రయోజనాలు ఉంటాయి. అయితే కొన్ని సమస్యలు ఉన్నవారు దీని జోలికి వెళ్లకపోవడమే మంచిది.
గర్భిణులు బొప్పాయి తినడం వల్ల ప్రసవం సమయంలో కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది పుట్టబోయే బిడ్డకు ప్రమాదం.
గుండె సమస్యలు ఉన్నవారు బొప్పాయికి దూరంగా ఉండటం మంచిది. ఇందులోని సైనోజెనిక్ కంపౌండ్స్ కార్డియాక్ కండీషన్స్ ఉన్నవారిలకి నష్టాన్ని చేకూరుస్తాయి.
బొప్పాయిలో లాటెక్స్ ఉంటుంది. ఇది అందరికి పడకపోవచ్చు. ఎలర్జీ ఉన్నవారు ఈ పండు తినకపోవడమీ మంచిదని అంటున్నారు.
అలెర్జీ ఉన్నవారు ఇది తింటే దురద, తుమ్ములు, శ్వాసకోశ ఇబ్బందులు వంటి సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు నిపుణులు.
థైరాయిడ్ ఉన్న వ్యక్తులు కూడా బొప్పాయిని దూరం పెట్టడం మంచిది. ఇది సమస్యను మరింత పెంచుతుందని అంటున్నారు వైద్యులు.
బొప్పాయిలో విటమిన్ సి కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి ప్రమాదం. అందుకే ఈ సమస్య ఉంటె మాత్రమే ఈ పండును దూరం పెట్టండి.
దీనిలో విటమిన్ సి ఆక్సలేట్స్గా మారుతుంది. ఇవి క్యాల్షియంతో కలిసి క్రిస్టల్లా ఏర్పడి కిడ్నీలలో రాళ్లలా తయారవుతాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇంటి ముందు కొబ్బరి చెట్టును పెంచవచ్చా.? పండితుల మాటేంటి.?
ఫ్రెంచ్ ఫ్రైస్తో షుగర్ వస్తుందా.? పరిశోదనలు ఏం చెబుతున్నాయి.?
పీతలను డైట్లో చేర్చుకున్న ఆదిలాబాద్ ప్రజలు.. కారణం అదేనా.?