అరటిపండుతో ఇవి తింటే.. మీ లైఫ్‎ని రిస్క్‎లో పెట్టినట్టే.. 

Prudvi Battula 

30 September 2025

అర‌టి పండులోని ఫైబ‌ర్‌, ప్రొటీన్‌, ఆరోగ్య‌క‌ర కొవ్వులు, మిన‌ర‌ల్స్‌, విట‌మిన్లు వంటివి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

జలుబు, ద‌గ్గుతో బాధ‌ప‌డే వారు, మ‌ధుమేహులు అర‌టి పండు తింటే కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇందులో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ స‌రైన మోతాదులో మితంగా తింటేనే ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు చేకూరుతాయి.

దీన్ని కొన్ని రకాల ఆహారల‌తో క‌లిపి తీసుకోవ‌డం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు పోషకాహార నిపుణులు.

అరటి పండును పాల‌తో క‌లిపి తినడం అంత మంచిది కాదు. ఇలా చేయడం వల్ల జీర్ణ‌క్రియ‌లో ఇబ్బందులు ఎదురవుతాయి.

అర‌టి పండుతో రెడ్ మీట్‌ అస్సలు ఎప్పుడు తీసుకోవద్దు. విరుద్ధ స్వ‌భావాలు కారణంగా వీటిని కలిపి తింటే గ్యాస్ స‌మ‌స్య త‌లెత్తే ప్రమాదం ఉంటుంది.

అర‌టిని బేక్ చేసిన పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు నిపుణులు.

అలాగే జామ‌పండు నిమ్మ‌, దానిమ్మ‌, స్ట్రాబెర్రీస్‎తో కూడా దీన్ని క‌లిపి తీసుకోరాదు. ఎందుకంటే ఇది జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది.