రాత్రిపూట చికెన్ తింటే.. ఈ పనులు కంపల్సరీ.. లేదంటే బాడీ గార్బేజ్కే..
12 August 2025
Prudvi Battula
మీరు రాత్రిపూట చికెన్ తింటే నిద్రకు కనీసం 2-3 గంటల ముందే తీసుకోండి. ఎందుకంటే ఇది జీర్ణం కావడానికి ఎక్కువ టైం పడుతుంది.
రాత్రుళ్ల చికెన్‌తో భోజనం చేసిన వెంటనే నిద్రపోకుండా కాసేపు నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.
రాత్రిపూట చికెన్ తిన్నట్లైతే ఒక కప్పు పుదీనా టీ తాగడం మంచిది. దీనివల్ల కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు ఉండవు.
రాత్రుళ్ల చికెన్ తిన్న తర్వాత కొద్దిగా జీలకర్రను నమలడం, గోరువెచ్చని నీళ్లు తాగడం వంటివి చేస్తే జీర్ణం త్వరగా అవుతుంది.
రాత్రిపూట చికెన్ అతిగా తినడం మానుకోండి. దీనివల్ల మీ నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఇది నిద్రలేమికి దారితీస్తుంది.
రాత్రుళ్లు చికెన్ కారంగా తినడం వల్ల గుండెలో మంట, ఎసిడిటీ సమస్యలు పెరుగుతాయని పోషకాహార నిపుణులు అంటున్నారు.
అలాగే నైట్ చికెన్ తిన్న తర్వాత చల్లని పానీయాలు తాగడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి.
ఈ టిప్స్ పాటిస్తే రాత్రిపూట చికెన్ తిన్న కూడా ఎలాంటి సమస్యలు ఉండవు. దీని ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఆరోగ్యంగా కూడా ఉంటారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
పోద్ది.. అలా చేస్తే మొత్తం పోద్ది.. మారిన ట్యాక్స్ రూల్స్!
వర్షాకాలంలో ఈ ఫుడ్స్ తింటే.. మీ ఆరోగ్యం అస్సలు తగ్గేదేలే..
స్త్రీ శరీరంపై ఆ ప్రదేశాల్లో బల్లి పడితే.. శుభమా.? అరిష్టమా.?