మీ తెల్ల జుట్టును నల్లగా మార్చే తిరుగులేని అస్త్రం.. ట్రై చేయండి
02 November 2025
TV9 Telugu
TV9 Telugu
ఒకప్పుడు వయస్సు మీద పడిన వారికి జుట్టు తెల్లబడేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధంలేకుండా అందరి జుట్టు తెల్లబడుతోంది. తెల్ల జుట్టును సులభంగా సహజపద్ధతుల్లో నల్లగా మార్చాలంటే ఇలా చేయండి
TV9 Telugu
తెల్లగా ఉన్న శిరోజాలను నల్లగా మార్చేందుకు బ్లాక్ టీని తయారు చేసి అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పును వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గోరు వెచ్చగా ఉన్నప్పుడు జుట్టుకు పట్టించి, బాగా మర్దనా చేయాలి
TV9 Telugu
ఈ మిశ్రమం జుట్టు కుదుళ్లకు బాగా తగిలేలా సున్నితంగా మర్దనా చేయాలి. అనంతరం 30 నిమిషాల పాటు వేచి ఉండాలి. తరువాత తలస్నానం చేస్తే సరి
TV9 Telugu
ఇలా తరచూ పాటిస్తుంటే తెల్లగా ఉన్న శిరోజాలు నల్లగా మారుతాయి. అలాగే ఉసిరికాయల రసం, కొబ్బరినూనెలను బాగా కలిపి జుట్టుకు బాగా పట్టించి 30 నిమిషాలు అయ్యాక తలస్నానం చేసినా ఫలితం ఉంటుంది
TV9 Telugu
కొబ్బరినూనెను కాస్త వేడి చేసి అందులో కొద్దిగా ఉసిరిక పొడి కలిపి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి గంటల తర్వాత తలస్నానం చేయాలి
TV9 Telugu
ఇలా తరచూ చేస్తున్నా కూడా సమస్య తగ్గుతుంది. గోరిటాంకు పొడి లేదా హెన్నాలో కొద్దిగా పెరుగు, ధనియాలు, మెంతులు, కాఫీ డికాషన్, తులసి ఆకుల రసం, పుదీనా ఆకుల రసం కలపాలి
TV9 Telugu
ఈ మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు ఉడికించాలి. రాత్రంతా దీన్ని అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఆ మిశ్రమాన్ని తలకు రాసి గంట తరువాత తలస్నానం చేయాలి
TV9 Telugu
ఈ చిట్కాను తరచూ పాటిస్తుంటే ఎంతగానో ఉపయోగం ఉంటుంది. దీని వల్ల జుట్టు నల్లబడడమే కాదు అన్ని రకాల జుట్టు సమస్యలు తొలగిపోయి శిరోజాలు ఒత్తుగా దృఢంగా పెరుగుతాయి