మీ  ముఖం అందంగా మెరిసిపోవాలా.. గులాబీలతో ఇలా చేయండి!

17 January 2025

samatha 

అందంగా నిగారింపుగా ఉండాలని ఎవరు అనుకోరు. చాలా మంది బ్యూటిఫుల్‌గా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.

ముఖ్యంగా తమ అందాన్ని పెంచుకోవడానికి ఎక్కువగా మార్కెట్‌లో దొరికే ఏవేవో క్రీమ్స్, మాయిశ్చరైజర్స్ వాడుతారు.

కానీ ఇవేవి లేకుండా మీ చర్మం మెరిసేలా చేయొచ్చునంట. అది ఎలా అనుకుంటున్నారా.. మీ కోసమే ఈ బ్యూటీ టిప్స్ 

గులాబీలు చర్మానికి మంచి తేమను అందించడంలో కీలక పాత్రపోషిస్తాయి. అలాగే ఇవి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.

అయితే ఈ గులాబీలతో మీరే స్వయంగా మాయిశ్చరైజర్ తయారు చేసుకొని వాడటం వలన మీ ముఖం అందంగా నిగారింపుగా తయారవుతుందంట.

మాయిశ్చరైజర్ తయారీకి.. 8గులాబీ పువ్వులు , రోజూ వాటర్, కొబ్బరి నూనె రెండు చెంచాలు, ఆల్మండ్ నూనె ఒక చెంచా తీసుకోవాలి.

గులాబీ రేకులను ఓ చిన్న బౌల్‌లో వేసి పావు కప్పు రోజ్ వాటర్ వేసి నాననివ్వాలి, తర్వాత దానిని పేస్టులా తయారు చేయాలి.

తర్వాత గులాబీ రేకుల పేస్టులో, కొబ్బరి నూనె, ఆల్మండ్ నూనె వేసి బాగా కలపాలి. దీంతో మాయిశ్చరైజర్ రెడీ. ఈ పేస్టు ప్రతి రోజూ చర్మానికి అప్లే చేసుకోవాలి.