అదిరిపోయేలా చైనీస్ స్టైల్‌లో చిల్లీ పన్నీర్ రిసిపీ.. ఇంట్లోనే ఇలా రెడీ చేయండి!
13 September 2025
Samatha
పన్నీర్ చిల్లీ రిసిపీ చాలా మందికి ఇష్టం ఉంటుంది. దీనిని స్పై సీ స్పైసీగా ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు. వారి కోసమే ఈ సమాచారం.
ఇండో చైనీస్ ఫేమస్ చిల్లీ పన్నీర్ రిసిపీని స్నాక్‌గా లేదా గ్రేవీ రూపంలో, ఫ్రైడ్ రైస్, నూడుల్స్, దీనిని ఎలా తీసుకున్నా, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందంట.
దీనిని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలంట. కావాల్సిన పదార్థాలు : 250 గ్రాముల పన్నీర్,2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ మైదా,1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 నల్లమిరియాలు, రుచికిసరిపడ ఉప్పు.
1 టేబుల్ స్పూన్ తరిగిన వెల్లుల్లి, 3,4 పచ్చిమిర్చీ,1 ఉల్లిపాయ, క్యాప్సికమ్ ఒకటి, 1 టేబుల్ స్పూన్ రెడ్ మిర్చీ సాస్,1 టేబుల్ స్పూన్ తరిగిన అల్లం.
ముందుగా కార్న్ ఫ్లోర్, మైదా, అల్లం,వెల్లులి పేస్ట్, ఉప్పు, మిరియాలు, వీటన్నింటిని కలిపి మెత్తగా పిండిలా తయారుచేసుకోవాలి. తర్వాత పన్నీర్ క్యూబ్స్ పూతపూసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.
తర్వాత స్టవ్ ఆన్ చేసి, కడాయి పెట్టి నూనె పోసి, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యాప్సికమ్, వేసి వేయించుకోవాలి.
తర్వాత సోయా సాస్, చిల్లీ సాస్, కెచప్, వెనిగర్, ఉప్పు, మిరియాలు వేసి బాగా కలపాలి.తర్వాత కార్న్ ఫ్లోర్ వేసి సాస్ చిక్కబడే వరకు ఉడికించాలి. తర్వాత పన్నీర్ వేసి కలపండి. అంతే చైనీస్ చిల్లీ పన్నీర్ రెడీ.