ఈ సింపుల్ చిట్కాతో చపాతీలు మృదువుగా.. పొరలుగా.. భలే రుచిగా!
08 October 2025
TV9 Telugu
TV9 Telugu
నేటి కాలంలో చాలా మంది రోజువారీ ఆహారంలో చపాతీ తప్పనిసరిగా మారింది. ఏదో ఒకపూట దీన్ని తీసుకుంటూనే ఉంటున్నారు
TV9 Telugu
మరి చపాతీ పిండి తయారీలో పాటించాల్సిన మెలకువలేంటో, ఎలా చేస్తే చపాతీలు మృదువుగా వస్తాయో ఇక్కడ తెలుసుకుందామా...
TV9 Telugu
చపాతీ పిండి కలిపేటప్పుడు అది మృదువుగా రావడం కోసం ఎక్కువ నీళ్లు కలపకూడదు. ఇలా చేస్తే పిండి మూతకు, చేసేటప్పుడు పీటకు, చేతులకు అతుక్కుపోతుంది
TV9 Telugu
కాబట్టి పిండి తడిపేటప్పుడు వీలైనంత తక్కువ నీటిని వాడండి. ఒకవేళ పిండి మరీ మెత్తగా అయిపోయి చేతులకు అంటుకుంటూ ఉంటే కాస్తంత పొడి పిండి కలిపితే సరి
TV9 Telugu
పిండి తడిపే సమయంలో లేదా పూర్తిగా తడిపిన తర్వాత అందులో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి మరోసారి బాగా కలపాలి. ఇలా చేస్తే చపాతీలు ఎక్కువ సమయంపాటు మృదువుగా ఉంటాయి
TV9 Telugu
చపాతీ పిండి తడపడానికి గోరువెచ్చని నీళ్లు లేదా పాలు వాడుకోవచ్చు. వీటితో పిండిని కలిపి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే చపాతీలు మృదువుగా వస్తాయి
TV9 Telugu
తయారుచేసి పెట్టుకున్న చపాతీ పిండిని ఫ్రిజ్‌లో భద్రపరిచే సమయంలో తప్పనిసరిగా మూత పెట్టాలి. లేదంటే పిండి పాడైపోతుంది
TV9 Telugu
పిండి పూర్తిగా తడిపిన తర్వాత దానిపై కొద్దిగా నూనె పోసి పొరలా రాయాలి. ఇలా చేస్తే పిండి ఎండిపోదు, పాడవదు. ఈ పిండిని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటే సరిపోతుంది