దసరా వచ్చేస్తుంది.. మటన్ బిర్యానీ ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్దీ అంతే!
18 September 2025
Samatha
దసరా పండుగ వచ్చేస్తుంది. మీ ఇంట్లోనే సులభంగా మటన్ బిర్యానీ చేసి ఫ్యామిలీకి సర్ఫ్రైజ్ ఇద్దాం అనుకుంటున్నారా?
అయితే మీకోసమే ఈ అదిరిపోయే సమాచారం, ఇలా సింపుల్‌గా దరసా పండగకు మీ ఇంటిలోనే మస్త్ రుచిని ఇచ్చే మటన్ బిర్యానీ తయారు చేయండి.
కావాల్సిన పదార్థాలు :బాస్మతి రైస్, మటన్, రెండు 500గ్రాములు, పెరుగు, 100 గ్రాములు, నిమ్మరసం 1 స్పూన్, కారం పొడి 15 గ్రాములు, ధనియాల పొడి వన్ టీస్పూన్ అల్లం వెల్లుల్లిపేస్ట్.
ఉప్పు రుచికి సరిపడ, గరం మసాల వన్ టీస్పూన్, ఆయిల్ 100 గ్రాములు, వేయించిన ఉల్లి ముక్కలు 30 గ్రాములు, జీడిప్పు, కొత్తిమీర తరుగు, పుదీన తరుగు, బిర్యానీ ఆకులు,నెయ్యి, నీళ్లు ఐదు మూడు లీటర్లు.
ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. తర్వాత అందులో మటన్ ఫ్రెష్‌గా కడికి వేసుకోవాలి. తర్వాత అందులో కారం, మసాల, పెరుగు, కొత్తిమీర,ధనియాల పొడిచ నూనె వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత మరొక గిన్నె తీసుకొని అందులో ఎసరు కోసం సరిపడ నీళ్లు పోసి, గరం మసాలా, బిర్యానీ ఆకలు వేసి ఎసరు పెట్టి తర్వాత రైస్ వేసుకోవాలి.
రైస్ కొంచెం ఉడికిన తర్వాత దానిని పక్కన పెట్టుకోవాలి. ఆతర్వాత కుక్కర్ స్టవ్ పై పెట్టి అందులో నూనె వేసి, బిర్యానీ ఆకులు, వేయించిన ఉల్లి , పచ్చిమిర్చి, వేసి వేయించాలి. తర్వాత మటన్ వేయాలి.
మటన్ కాస్త ఉడికిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న సగం ఉడికిన బియ్యాన్ని కుక్కర్‌లో వేసి 20 నిమిషాలు సన్నటి మంటపై ఉడకనివ్వాలి. అంతే వేడ వేడి బిర్యానీ రెడీ.