స్పైసీ స్పైసీ ఫిష్ పకోడి.. ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేయండి!

08 october 2025

Samatha

ఫిష్ కర్రీ, ఫిష్ వేపుడు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది చేపల కర్రీ, చేపల పులుసు, ఫిష్ ఫ్రైని ఎంతో ఇష్టంగా తింటుంటారు.

అయితే ఫిష్ ఫ్రైనే కాదండోయ్, ఫిష్ పకోడి కూడా అదిరిపోతుందంట. అయితే మీరు కూడా ఫిష్ పకోడి ట్రై చేద్దాం అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ టిప్స్.

ఇంట్లోనే సులభంగా స్పై స్పైసీ ఫిష్ పకోడీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూడండి. ఫిష్ పకోడికి కావాల్సిన పదార్థాలు, ముల్లులు లేనటువంటి చేప ముక్కలు హాఫ్ కేజీ.

కోడిగుడ్డు , మసాలా,  మిరపకాయలు, శనగ పిండి, ఉప్పు, నూనె, పచ్చి మిర్చీ, ధనియాల పొడి, గరం మసాలా,  కొత్తి మీర, నిమ్మకాయ. రుచికి సరిపడ ఉప్పు.

ముందుగా చేప ముక్కలు బాగా కడిగి,  ఒక బౌల్‌లోకి తీసుకోవాలి.  తర్వాత వాటికి కారం, శనగ పిండి గుడ్డు సొన వంటివి  వేసి మొత్తం కలుపుకోవాలి.

మసాలా, కారం, ఉప్పు, కొత్తిమీర, కోడిగుడ్డు, ధనియాల పొడి, పసుపు,  శనగ పిండి మిశ్రమంలో చేపలను వేసి కలుపుకోవాలి. తర్వాత వాటిని అర గంటసేపు పక్కన పెట్టుకోవాలి.

ఆ తర్వాత మరో పాన్ తీసి అందులో నూనె పోసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేపల మిశ్రమం ఉందిగా, దానినిలోని ఒక్కో చేపను తీసి నూనెలో వేసి వేయించుకోవాలి.

అంతే చేప ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటూనే ఉండాలి. అంతే వేడి వేడి ఫిష్ పకోడి రెడీ, దీనిపై కాస్త కొ త్తిమీర, మసాల చల్లి తింటే టేస్ట్ అదిరిపోద్దీ.