సన్నజాజి తీగలా మారాలా? ఐతే రాత్రిళ్లు ఈ నీళ్లు తాగండి

19 November 2025

TV9 Telugu

TV9 Telugu

దాల్చిన చెక్క దాదాపు ప్రతి కిచెన్‌లో ఉంటుంది. దీన్ని మ‌నం మ‌సాలా దినుసుగా అనేక వంట‌కాల్లో ఉప‌యోగిస్తుంటాం. వంటల్లో దాల్చిన చెక్క‌ను వేయ‌డం వ‌ల్ల వంట‌కాలకు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి

TV9 Telugu

దాల్చిన చెక్క‌లో అనేక ఔష‌ధ గుణాలు కూడా ఉంటాయి. ఇవి మ‌న‌కు క‌లిగే వ్యాధుల‌ను న‌యం చేసేందుకు స‌హాయం చేస్తాయి. దాల్చిన చెక్క మ‌న‌కు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలను అందిస్తుంది

TV9 Telugu

ఒక కప్పు నీటిని మరిగించి అందులో 1 టీస్పూన్‌ తేనె, అర టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడిని కలపాలి. ఆ మిశ్రమం ఉన్న పాత్రపై మూత పెట్టి దాన్ని 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి

TV9 Telugu

ఆ తరువాత అందులో మరికొంత తేనె కలపాలి. ఆ మిశ్రమాన్ని రాత్రి నిద్రకు ముందు సగం తాగాలి. మిగిలిన సగాన్ని మరుసటి రోజు ఉదయం పరగడుపునే తాగాలి

TV9 Telugu

ఇలా రోజూ చేస్తుంటే శ‌ర‌రీంలోని కొవ్వు క‌రుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఒక కప్పు నీటిలో ఒక టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడిని వేసి బాగా కలిపి ఆ మిశ్రమంతో నోటిని పుక్కిలించాలి

TV9 Telugu

ఇలా చేస్తే నోట్లో ఉండ బ్యాక్టీరియా న‌శించి నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి

TV9 Telugu

ఒక టీస్పూన్‌ తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడిని తీసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. కొంతసేపు ఆగాక కడిగేయాలి

TV9 Telugu

ఇలా చేస్తుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉండే మొటిమ‌లు, మ‌చ్చ‌లు తొల‌గిపోతాయి. ముఖం అందంగా క‌నిపిస్తుంది