ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ మిసీలెనీయస్ ప్రొవిజన్స్ యాక్టు 1952 కింద ప్రతి ఎంప్లయ్‌కి ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) ఉంటుంది. ఈపీఎఫ్ పథకంలో ఉద్యోగి కొంత శాతం చెల్లింపు చేయగా కొంత సంస్థలు చెల్లిస్తాయి
TV9 Telugu
ప్రతి ఉద్యోగి ప్రతి నెలా తన ప్రాథమిక జీతంలో 12 శాతాన్ని పీఎఫ్ ఖాతాకు కంట్రిబ్యూషన్‌గా చెల్లిస్తారు. అలాగే వారి యజమాని కూడా అంతే మొత్తాన్ని జమ చేస్తారు
TV9 Telugu
అయితే పీఎఫ్ కార్యాలయాన్ని సందర్శించకుండా, మీరు పనిచేసే సంస్థ యజమానిని అడగకుండానే పీఎఫ్ బ్యాలెన్స్‌ను తనిఖీ చేయడానికి వివిధ పద్ధతులు ఉన్నాయి
TV9 Telugu
ఉద్యోగి తమ ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవడానికి ఈపీఎఫ్ఓ వెబ్ సైట్‌లో Our Services విభాగంలోని For Employees ఆప్షన్ పై క్లిక్ చేసి, Member Passbook ఆప్షన్ పై క్లిక్ చేసి లాగిన్ అయితే తెలుసుకోవచ్చు
TV9 Telugu
ఒకసారి మీరు లాగిన్ అయిన తర్వాత మీ పీఎఫ్ కాంట్రిబ్యూషన్స్‌తోపాటు అప్పటి వరకు మీరు పొందిన పీఎఫ్ వడ్డీ మొత్తాన్ని కూడా చూడొచ్చు. ఒకవేళ మీ యూఏఎన్‌కు ఒకటి కంటే ఎక్కువ పీఎఫ్ నంబర్లు ఉంటే అవి కూడా చూడొచ్చు
TV9 Telugu
యూనిఫైడ్ పోర్టల్లో లాగిన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇందులో పీఎఫ్ పాస్‌బుక్‌పై క్లిక్ చేసి మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను చూడొచ్చు. యూఏఎన్ లేకుండా మొబైల్ ఎస్ఎంఎస్ ద్వారానూ తెలుసుకోవచ్చు
TV9 Telugu
మీ మొబైల్లో EPFOHO UAN ENG అని టైపే చేసి 77382 99899 నంబర్‌కి ఎస్సెమ్మెస్ పంపిస్తే వెంటనే మీ బ్యాలెన్స్ మెసేజ్ వస్తుంది. అలాగే ఉమాంగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని కూడా తెలుసుకోవచ్చు
TV9 Telugu
మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి 011-22901406 నంబబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ వివరాలతో కూడిన ఎస్సెమ్మెస్ పొందొచ్చు. దీనికి కూడా మీ యూఏఎన్ నెంబర్ అవసరం లేదు