కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎంత నీళ్లు తాగాలో తెల్సా?

05 October 2025

TV9 Telugu

TV9 Telugu

కిడ్నీలు మన శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి పనిచేస్తాయి. సోడియం, పొటాషియం వంటి ఖనిజాల సమతుల్యతను కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన కిడ్నీలు చాలా అవసరం

TV9 Telugu

నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ప్రకారం.. మూత్రపిండాలు మూత్రం ద్వారా శరీరం నుంచి విషాన్ని తొలగిస్తాయి. అందుకే కిడ్నీల ఆరోగ్యాన్ని ఎల్లవేళలా కాపాడుకోవాలి

TV9 Telugu

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే పుష్కలంగా నీరు తాగాలి. ఆరోగ్యకరమైన ద్రవ ఆహారాలు తీసుకోవాలి. అదే తక్కువ నీరు తాగితే మూత్రపిండాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది

TV9 Telugu

దీనివల్ల ఎలక్ట్రోలైట్, ఖనిజ అసమతుల్యత సంభవించవచ్చు. దీనితోపాటు చర్మం పొడిబారడం వల్ల అలసట, బలహీనత, తలనొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి

TV9 Telugu

ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. ఆరోగ్యకరమైన వయోజన మహిళ రోజుకు కనీసం 2.7 లీటర్ల నీరు అవసరం. అయితే శారీరక శ్రమను బట్టి కాస్త ఎక్కువగా తీసుకోవచ్చు

TV9 Telugu

అదే ఒక వయోజన పురుషుడికి రోజుకు సుమారు 3.7 లీటర్ల నీరు అవసరం. ఇందులో కేవలం తాగునీరు మాత్రమే కాదు జ్యూస్‌లు, కూరగాయలు, జ్యూసీ పండ్ల నుంచి తీసిన ద్రవాలు కూడా తీసుకోవచ్చు

TV9 Telugu

మీకు ఎంత నీరు అవసరమో మీ శారీరక శ్రమ, వయస్సు, వైద్య పరిస్థితులు, నివసించే వాతావరణం, చలి లేదా వేడి మీద ఆధారపడి ఉంటుంది

TV9 Telugu

మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన మాస్ యుఎస్ సర్వే రీసెర్చ్ నివేదిక (2011-2012) ప్రకారం 500 మి.లీ నీరు తాగిన వారికి 1.2 లీటర్ల నీరు త్రాగిన వారి కంటే దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది