నోబెల్ గ్రహితలకు ఇచ్చే డబ్బు ఎంత.? కల్పించే సౌకర్యాలు ఏంటి.?

07 October 2025

Prudvi Battula 

నోబెల్ బహుమతి స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్థం అసాధారణ సేవ చేసిన వ్యక్తులకు నోబెల్ బహుమతి ఇచ్చి సంతరించుకుంది.

భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యం/ఫిజియాలజీ, సాహిత్యం, శాంతి, ఆర్థిక శాస్త్రాలు (ఎకనామిక్స్) ఆరు రంగాలలో నోబెల్ బహుమతులు ప్రతి సంవత్సరం ఇస్తారు.

ప్రతి ఏట నోబెల్ విజేతలను అక్టోబర్‌లో ప్రకటించి ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10న స్వీడన్‌లో ప్రదానోత్సవం నిర్వహిస్తారు. శాంతి బహుమతి నార్వేలోని ఇస్తారు.

ప్రతి నోబెల్ బహుమతి గ్రహీతకు 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్ ఇస్తారు. మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ. 10.5 కోట్లు అన్నమాట.

ఒకే విభాగంలో ఒక కంటే ఎక్కువ మంది విజేతలు ఉంటే మాత్రం ఈ మొత్తం సమానంగా విభజించి వారికి ఇవ్వడం జరుగుతుంది.

విజేతలు బంగారుతో తయారు చేసిన ఆల్ఫ్రెడ్ నోబెల్ చిత్రంతో ఉన్న నోబెల్ పతకాన్ని పొందుతారు. విభాగాన్ని బట్టి దీని డిజైన్ ఉంటుంది.

అదనంగా నోబెల్ బహుమతి పొందిన విజేతలకు వారి పేరు, విజయాలతో వివరించబడిన ఉన్న డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు.

డబ్బు, పతకానికి మించి, నోబెల్ విజేతలకు ప్రపంచ స్థాయిలో శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులు, ప్రఖ్యాత వ్యక్తుల నుంచి గౌరవాన్ని పొందుతారు.