చపాతీ ఇలా తింటే సమస్యలే.. రోజుకు ఎన్ని తినాలంటే?

19 october 2025

Samatha

భారతీయ వంటకాల్లో ముఖ్యమైన వాటిలో చపాతీ ఒకటి. ప్రతి ఒక్కరూ నైట్ డిన్నర్ లోకి లేదా మధ్యాహ్నం టిఫిన్‌లోకి తప్పకుండా చపాతీలు చేస్తుంటారు.

ఇక రోజూ చపాతీ తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది ప్రతి రోజూ తమ భోజనంలో  చపాతీ తింటుటారు.

అయితే చాలా మందిలో ఒక పెద్ద డౌట్ ఉంటుంది. అది ఏమిటంటే? అసలు చపాతీలు ఎన్ని తినడం ఆరోగ్యానికి మంచిది. రోజుకు ఎన్ని తినాలి అని.

ఇప్పుడు మనం ఒక వ్యక్తి రోజుకు ఎన్ని చపాతీలు తినాలి అనే విషయం తెలుసుకుందాం. నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజుకు రెండు నుంచి మూడు చపాతీలు తినాలంట.

రోజుకు రెండు లేదా మూడు చపాతీలు తినడం ఆరోగ్యానికి మంచిది. అంత కంటే ఎక్కువ చపాతీలు తినడం వలన అనారోగ్య సమస్యలు ఎదర్కోక తప్పదంట.

ముఖ్యంగా ఎక్కువ చపాతీలు తినడం వలన త్వరగా బరువు పెరిగే ఛాన్స్ ఉన్నదంట. అందుకే బరువు తగ్గాలి అనుకునే వారు చపాతీలు ఎక్కువ తినకూడదు.

అలాగే, గ్యాస్, ఎసిడిటీ, తరచూ విరేచనాలు అయ్యే సమస్యలు ఉన్నవారు వీలైనంత వరకు చపాతీలు చాలా తక్కువ తినాలంట. లేకప సమస్యలు తీవ్రతరం అవుతాయి.

నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడినది. దీనిని టీవీ9 తెలుగు దృవీకరించలేదని గమనించగలరు.