మీ ఇంటి కుళాయి తెల్లటి మరకలతో నిండిపోయిందా.. మీ కోసమే సింపుల్ టిప్స్!
Samatha
8 november 2025
ప్రతి ఒక్కరి ఇంటిలో కుళాయి అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే కుళాయిలపై ఎక్కువగా తెల్లటి మరకలు కనిపిస్తుంటాయి. దీంతో వాటిని చూడటానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు.
దీంతో వాటిని తొలిగించడానికి ఇంటి వారు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొన్ని సార్లు దానిని ఎంత క్లీన్ చేసినా అవ్వదు. దీంతో కుళాయిని అలాగే వదిలేస్తారు.
కానీ కొన్ని సింపుల్ టిప్స్ ద్వారా నీటి కుళాయిపై ఉన్న తెల్లటి మరకలు చాలా సులభంగా తొలిగించ వచ్చునంట. అది ఎలానో ఇప్పుడు మనం చూద్దాం.
ఒక కప్పు వెనిగర్‌లో 2-3 టీ స్పూన్ల బేకింగ్ సోడా వేసి, ఆ మిశ్రమాన్ని మరక ఉన్న ప్రదేశంలో అప్లై చేసి కాసేపు అలాగే ఉంచి, నీటితో శుభ్ర పరుస్తే మరక మాయం అవుతుందంట.
అలాగే నిమ్మకాయకు మొండి మరకలను తొలిగించే స్వభావం ఉంటుంది. అందువలన నిమ్మకాయను సగానికి కట్ చేసి వాటితో మరకలు ఉన్న చోట రాస్తూ క్లీన్ చేయాలి. ఇలా మరకలు తొలిగిపోతాయి
అలాగే బ్లీచింగ్ తో కూడా కుళాయి పై ఉన్న తెల్లటి మరకలను తొలిగించ వచ్చునంట. బ్లీచింగ్‌ను తీసుకొని, ఒక క్లాత్‌లో వేసి, గట్టిగా ముడి కట్టి దానితో మరకను తొలిగించాలంట.
అదే విధంగా ఇంటి కుళాయి మరకలను సులభగా తొలిగించాలంట, నిమ్మరసం,ఉప్పు వీటిని ఒక బౌల్లో కలుపుకొని, స్పాంజ్‌తో మరకల ఉన్న చోట గట్టిగా రాస్తే మరకలు తొలిగిపోతాయి.