ఫేస్ వాష్ చేసే ముందు పాటించాల్సిన సింపుల్ టిప్స్ ఇవే!

Samatha

11 july  2025

Credit: Instagram

ప్రతి ఒక్కరూ రోజులో రెండు లేదా మూడు సార్లు ఫేస్ వాష్ చేసుకుంటారు. అయితే ఇలా ఫేస్ వాష్ చేసుకునే ముందు కొన్ని టిప్స్ పాటించాలంట. 

ముఖం కడుక్కోవడానికి గోరు వెచ్చటి నీరు మాత్రమే ఉపయోగించాలంట. అస్సలే ఎట్టిపరిస్థితుల్లో ఎక్కువ ఉష్ణోగ్రత కలిగిన నీటిని మాత్రం ఉపయోగించకూడదంట.

కొందరు మేకప్ తొలిగించకుండానే ఫేస్ వాష్ చేసుకుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదంట. మేకప్ సున్నితంగా తొలిగించిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే, మంచిదంట.

ముఖాన్ని కడుక్కునే ముందు మీ చేతులు మురికిగా లేకుండా చూడాలి. లేకపోతే ఆ బ్యాక్టీరియా మీ ఫేస్‌ను పాడు చేసే ప్రమాదం ఉంది.

ఎప్పుడూ కూడా ఫేస్ వాష్ విషయంలో జాగ్రత్తగా ఉండాలంట. సున్నితమైన ఫేస్ వాష్ చర్మాన్ని కాపాడుతుంది.

ముఖాన్ని అందంగా నిగారింపుగా తయారు చేసుకోవాలి అంటే, తప్పకుండా రోజులో రెండు సార్లు ఫేస్ వాష్ చేసుకోవాలంట.

మీ ముఖాన్ని కడిగిన తర్వాత దానిని తుడుచుకోవడానికి ఒక్క తువ్వాలనే ఉపయోగించాలి. అంతే కాకుండా దానిని పదే పదే ఉతకాలి.

లేకపోతే దానిపై ఉండే బ్యాక్టీరియా ముఖంపైకి చేరి మొటిమలు, జిడ్డు చర్మం వంటి సమస్యలు వస్తాయి. అందుకే ముఖం కడుక్కునే ముందు ఈ టిప్స్ పాటించాలంట.