వాల్ నట్స్ తినడం వలన కలిగే 8 అద్భుత ప్రయోజనాలు ఇవే!
samatha
22 JUN 2025
Credit: Instagram
వాల్ నట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. అందువలన వీటిని తప్పకుండా తినాలని సూచిస్తారు ఆరోగ్య నిపుణులు. దీని వలన అనేక ప్రయోజనాలు ఉంటాయంట. అవి ఏవో తెలుసుకుందాం.
వాల్ నట్స్‌లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్స్, పుష్కలంగా ఉంటాయి. అందువలన వీటిని ప్రతి రోజూ తినడం వలన ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయంట.
వాల్ నట్స్ మెదడు పనితీరును మెరుగు పరచడంలో కీలక పాత్రపోషిస్తాయంటున్నారు వైద్యులు. అందుకే వీటిని మీ డైట్‌లో చేర్చుకోవడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుందంట.
ప్రతి రోజూ క్రమం తప్పకుండా వాల్ నట్స్ తీసుకోవడం వలన ఇది జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుందంట. అదే విధంగా రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా గట్ బ్యాక్టీరియను కూడా పెంచుతుందంట.
చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారికి ఇది బెస్ట్. ఎందుకంటే ? వాల్ నట్స్ లో మెలటోనిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీకు ప్రశాంతమైన నిద్రనందిస్తుంది.
బరువు నియంత్రణకు కూడా ఇవి ఉపయోగపడుతాయంట. వాల్ నట్స్ లో కెలరీలు అధికంగా ఉన్నప్పటికీ ఇవి ఆకలిని తగ్గించి బరువును నియంత్రణలో ఉంచుతాయంట.
వాల్ నట్స్‌లో గ్లైసెమిక్ తక్కువ స్థాయిలో ఉంటుంది. అందు వలన దీనిని ప్రతి రోజూ తినడం వలన ఇది రక్తంలోని చక్కర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతాయి.