ఈ మట్ట బియ్యం వైట్ రైస్ కంటే కూడా చాలా ఆరోగ్యకరమైనది.ఈ బియ్యానికి పాలిష్ ఉండదు. చూడటానికి మనకు ఎర్ర బియ్యంలా కనపడతాయి. ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..
ఈ బియ్యంలో పోషకాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, జింక్ వంటి పోషకాలు ఉంటాయి. విటమిన్ బి1, బి6 ఉంటాయి. జీవక్రియ, మెదడు పనితీరుకు మంచిది.
శుద్ధి చేసిన తెల్ల బియ్యంలా కాకుండా, మట్ట బియ్యం తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మరీ మంచిది
ఈ బియ్యంలోని కాల్షియం, మెగ్నీషియం బలమైన ఎముకలు, దంతాలకు దోహదం చేస్తాయి. ఇది ఆస్టియోపోరోసిస్ కీళ్ల సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఈ రైస్‌లో సహజ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి దీనికి ఎరుపు రంగును ఇస్తాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
శరీరంలోని మంటను తగ్గించడానికి సహాయపడతాయి. బ్రౌన్ రైస్‌లో ఆంథోసైనిన్‌ల వంటి సహజ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి దీనికి ఎరుపు రంగును ఇస్తాయి.