పచ్చి యాలకులలో ఇంత మ్యాటర్ ఉందా?

Jyothi Gadda

03 February 2025

ఆకుపచ్చ యాలకులు. పురాతన కాలం నుంచి సుగంధ ద్రవ్యంగా యాలకులను వినియోగిస్తూనే ఉన్నారు. మనలో చాలామంది దీనిని మౌత్ ఫ్రెషనర్‌గా కూడా ఉపయోగిస్తారు.

యాలకుల్లో అనేక ఔషధ గుణాలతో ఉన్నాయి. పచ్చి ఏలకులలో కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇది జీవక్రియను పెంచుతుంది. మానసిక ఒత్తిడిని నియంత్రించటంతోపాటు మూత్రపిండాల్లో రాళ్ళను కరిగిస్తాయి. ఉదర సంబంధిత వ్యాధుల నివారణకు యాలకులు చక్కని పరిష్కారం.

రాత్రి భోజనం పూర్తయ్యాక నిద్రకు ముందుగా రెండు యాలకులు తిని ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్ళు తాగటం వల్ల శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడానికి దోహపడతాయి.

యాలకులలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. నోటి దుర్వాసనకు ప్రధాన కారణమైన నోటిలో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేయడంలో యాలకులు సహాయపడుతుంది. 

యాలకులతో ఒత్తిడి తగ్గుతుంది. మెదడులో సెరోటోనిన్ స్థాయిలను పెంచడం ద్వారా ఇది పనిచేస్తుంది. ఇది న్యూరోట్రాన్స్మిటర్, ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

యాలకుల్లో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి.. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

యాలకులలో ఉండే పీచు ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది మిమ్మల్ని తక్కువ తినేలా చేస్తుంది..ఫలితంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.