నిర్మలమ్మ ధరించే చీరలు మన దేశ సంస్కృతి, వారసత్వాన్ని ప్రదర్శించేలా చేస్తుంది. అందుకే బడ్జెట్ సమర్పించే రోజు ఆమె కట్టుకునే చీరలు కూడా ఎంతో ప్రత్యేకతలను కలిగి ఉంటాయి.
తొలి కేంద్ర బడ్జెట్‌లో సీతారామన్ గులాబీ రంగు మంగళగిరి చీర, బంగారు అంచుతో ధరించారు. ముదురు రంగు ఆమె వినూత్న విధానానికి, బంగారు అంచు గొప్ప వస్త్ర వారసత్వానికి ప్రతీక.
2020 బడ్జెట్ కోసం, సీతారామన్ ఆశాజనకమైన పసుపు రంగు నీలి అంచుతో కూడిన పట్టు చీరను ధరించారు. ఇది కష్టకాలంలో ఆశ, ఆర్థిక వృద్ధికి చిహ్నాంగా విశ్లేషించారు.
తెలంగాణ నుండి వచ్చిన అద్భుతమైన చేనేత పోచంపల్లి ఇక్కత్ చీర, ఎరుపు, తెలుపు రంగుల కలయిక, ఆకుపచ్చ అంచుతో ఉంది. ఇది ప్రభుత్వం వృద్ధి, పునరుజ్జీవనంపై దృష్టి సారించడాన్ని సూచిస్తుంది.
2022 ఒడిశాకు చెందిన బొంకాయ్ చీరను ధరించారు. అందమైన గోధుమ రంగు, వెండి జరీ వర్క్, అంచు వెంట వివరణాత్మక నమూనాలతో కూడిన చీర ఇది..
2023లోసీతారామన్ ముదురు ఎరుపు రంగు పట్టు చీర, నలుపు-బంగారు రంగుల ఆలయ అంచుతో అందరి దృష్టిని ఆకర్షించారు. కర్నాటకలోని ధార్వాడ్‌కు చెందిన ఇలకల్ పట్టును సారీ ఇది.
2024- గత ఏడాది నిర్మలమ్మ ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ ను సమర్పించారు. ఆ సమయంలో నీలిరంగు చీరను ధరించారు. ఇది పశ్చిమబెంగాల్లో లభించే కంఠ ఎంబ్రాయిడరీ.
బడ్జెట్ కోసం నిర్మలా సీతారామన్ అందమైన తెల్లని మంగళగిరి చీర ధరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన మంగళగిరి చీర దాని సరళతకు, చక్కని అంచులకు, చక్కని కళాత్మకతకు ప్రసిద్ధి చెందింది.
2025 బడ్జెట్ వేళ కూడా హ్యాండ్లూమ్ చీరనే ధరించారు. ఈ చీర ప్రత్యేకత ఏంటంటే.. పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీ దేవి నిర్మలకు కానుకగా ఇచ్చి బడ్జెట్ సమయంలో కట్టుకోవాలని కోరారు.