ఆరోగ్య సంజీవని తమలపాకులు.. రోజూ తింటే ఎన్ని లాభాలో..
Samatha
10 july 2025
Credit: Instagram
తమల పాకులు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు అవి ఏవో తెలుసుకుందాం.
తమలపాకులను వాటి యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీఆక్సిడెంట్ లక్షణాల కలిగి ఉన్నాయి. దీంతో ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో, దుర్వాసనను తగ్గించడంలో శ్వాసకోశ వ్యాధులకు చికిత్స చేయడంలో సహాయపడతాయి.
తమలపాకులు యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీఆక్సిడెంట్ లక్షణాల కలిగి ఉన్నాయి. దీంతో ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
తమలపాకులను భోజనం తర్వాత తినడం వలన ఇది జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేసి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తాయి.
పేగు ఆరోగ్యానికి తమల పాకులు మంచివి, పేగుల్లో ఉండే చెడు బ్యాక్టీరియా నుంచి కాపాడి, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి
తమల పాకులను ప్రతి రోజూ తీసుకోవడం వలన కడుపు సంబంధిత ఉబ్బరం, గ్యాస్ , ఎసిడిటి సమస్యల నుంచి బయటపడవచ్చు.
తమలపాకులు నోటి ఇన్ఫెక్షన్లను నివారించి, నోటిని శుభ్రంగా ఉంచుతాయి. నోటి దుర్వాసనను తొలగించడంలో కూడా ఇవి సహాయపడతాయి.
అదే విధంగా తమల పాకులను నమలడం వలన నాడీ వ్యవస్థ బాగుంటుంది. ఇవి మానసిక ఒత్తిడిని తగ్గించి, ప్రశాంతతను కలిగిస్తాయి.