జుట్టు ఒత్తుగా.. పొడవుగా పెరగాలా? ఐతే ఈ టీ తాగేయండి..
21 August 2025
TV9 Telugu
TV9 Telugu
పచ్చగా నవనవలాడే జామ కాయల్ని ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. ఇవి ఆరోగ్యానికి ఉపయోగపడినట్టే... వాటి ఆకులతోనూ మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి
TV9 Telugu
ముఖంపై మచ్చలు టీనేజర్లను బాగా ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటప్పుడు ఒక జామ ఆకు, రెండు తులసి ఆకుల్ని నూరి ముఖానికి రాసుకోండి. ఫలితముంటుంది
TV9 Telugu
కార్బోహైడ్రేట్లు చక్కెరగా మారే ప్రక్రియని జామ ఆకులు నియంత్రిస్తాయి. జామఆకులతో చేసిన టీని తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటూ మధుమేహం నియంత్రణలో ఉంటుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ని అదుపులో ఉంచుతుంది
TV9 Telugu
జామ ఆకులలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. దీని టీ తాగడం వల్ల శరీర రోగనిరోధక శక్తి బలపడుతుంది
TV9 Telugu
జామ ఆకులలో విటమిన్ ఎ కూడా అధికంగా ఉంటుంది. ఇది దృష్టిని మెరుగుపరచడంలో, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది
TV9 Telugu
జామ ఆకుల టీ తాగడం వల్ల మానసిక ఒత్తిడి, అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే జుట్టు బలంగామారి, మందంగా ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు సమస్య కూడా తొలగిపోతుంది
TV9 Telugu
ఇది చర్మంపై మచ్చలను తొలగించడంలోనూ సహాయపడుతుంది. మీ చర్మం మెరిసిపోవాలంటే జామ ఆకుల టీ తయారు చేసుకుని రోజూ తాగితేసరి. ఈ టీ మధుమేహాన్ని కూడా నియంత్రిస్తుంది
TV9 Telugu
ఈ టీ ముఖ్యంగా ప్రీడయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఆకులలో లభించే యాంటీఆక్సిడెంట్లు వాపు, ఆక్సీకరణ ఒత్తిడి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఆకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ జీవక్రియను పెంచుతాయి.బరువు తగ్గడంలో సహాయపడతాయి