బుట్టల కొద్దీ పూలు.. ఇలా చేస్తే సన్నజాజి మల్లెలు విరగబూస్తాయి!

samatha

09 september 2026

Pic credit - Pinterest

సన్నజాజి పూలు అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు. ప్రతి ఒక్కరికీ ఈ మల్లెపూలు అంటే అమితమైన ప్రేమ ఉంటుంది.

కొంత మంది మహిళలు ప్రత్యేకంగా ఈ పూలనే కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఇవి అంటే అంత ప్రేమ ఉంటుంది.

అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది తమ ఇంటి వద్ద సన్నజాజి మల్లె మొక్క నాటుకున్నారు. అయితే ఇది సీజన్‌తో పని లేకుండా పూయాలని ఎవరికి మాత్రం ఉండదు.

మరి మీ ఇంటి వద్ద ఉన్న సన్నజాజి మొక్క కూడా సీజన్‌తో పని లేకుండా పూయాలి అంటే తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలంట. అవి

సన్న జాజి పూలు సీజన్‌తో పని లేకుండా పూయాలి అంటే తప్పకుండా చెట్టు కొమ్మలను కట్ చేస్తూ, ఆకులను తుంచి వేయాలి.

అంతే కాకుండా ఎప్పుడూ కూడా ఈ మొక్కకు సూర్యరశ్మి తాకేలా చూసుకోవాలి. సూర్య రశ్మి తగిలితే మొక్క పెరుగుతూ మొగ్గలేస్తుంది.

అలాగే సేంద్రియ ఎరువులతో పాటు, ఉల్లిపాయ, అరటి తొక్కలు, గుడ్డు పెంకులు, వేప పిండి వంటి వేయడం చాలా మంచిది.

వీటిని వేస్తూ, ప్రతి రోజూ బియ్యం కడిగిన నీటిని మొక్క మొదట పోయడం వలన మొక్క సీజన్‌తో పని లేకుండా ఎక్కువ మొత్తంలో పూలనిస్తుంది.